👉 నిబంధనలు సడలించి ధాన్యం కొనుగోలు చేస్తున్నాం ! ప్రభుత్వం..
👉 మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J SURENDER KUMAR,
ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త నిబంధనలతో కొంత ఆలస్యం జరిగిందని, మా ప్రజా పాలన ప్రభుత్వం నిబంధనలు సడలించి ధాన్యం కొనుగోలు చేస్తున్నదని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
మంగళవారం రాత్రి జగిత్యాల జిల్లాలో కురిసిన ఆకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని బుధవారం మంత్రి లక్ష్మణ్ కుమార్ పరిశీలించారు. ధర్మపురి మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో తడిసిన వరి ధాన్యం, మక్కజొన్నలను మంత్రి పరిశీలించారు.
👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ….
ధాన్యం కొనుగోలు సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్ విధానాన్ని తీసుకువచ్చింది అని అన్ లైన్ లో ట్రక్ షీట్ తో పాటు ధాన్యం తరలిస్తున్న వాహనాలకు జిపిఆర్ఎస్ వంటి సాంకేతిక సమస్యలతో కొనుగోలు 15 రోజులు ఆలస్యంగా ప్రారంభమైనట్లు మంత్రి వివరించారు.

👉 కేంద్రం తీసుకొచ్చిన నిబంధనలతో రైతులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో నిబంధనలను సడలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత పద్ధతిలో ధాన్యం కొనుగోలుకు ఆదేశాలు జారీ చేయడంతో కొనుగోలు ప్రారంభమైనట్లు మంత్రి వివరించారు.
👉 వారం పది రోజుల్లో మార్కెట్ యార్డుల్లో ఉన్న ధాన్యంతో పాటు మక్కజొన్న కొనుగోలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.రైతులు ఎవరు ఆందోళన పడవద్దు ధర్నాలు రాస్తారోకోలకు దిగవద్దని రైతులు పండించిన పంటను చివరి గింజ కొనుగోలు చేసే బాధ్యతను తాను తీసుకుంటానని మంత్రి అన్నారు.
👉 అధికారులు సమన్వయం చేసుకొని ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని మంత్రి ఈ సందర్భంగా సూచించారు. రైతులకు కొనుగోలు విషయంలో ఎలాంటి సమస్యలు ఉన్న సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించాలని మంత్రి సూచించారు.

👉 రైతులు తమ సమస్యలు నా దృష్టికి తెస్తే పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేష్, చిలుముల లక్ష్మణ్, వేముల రాజు, సౌళ్ల నరేష్, చీపురుశెట్టి రాజేష్ తదితరులు ఉన్నారు.
