J.SURENDER KUMAR,
ధర్మపురి మండలం జైన గ్రామంలో ఏర్పాటుచేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు రావలసిందిగా ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మన్ కుమార్ ను కమిటీ సభ్యులు ఆహ్వానించారు.
ధర్మపురి లో మంత్రి క్యాంప్ కార్యాలయానికి సోమవారం జైన గ్రామ అంబేద్కర్ కమిటీ అధ్యక్షులు కట్ట లచ్చయ్య, మరియు ప్రధానకార్యదర్శి దుర్గం రవీందర్ నేతకానీ.. కమిటీ సభ్యులు మంత్రిని శాలువాతో సన్మానించారు. జూలై 4న ఉదయం 10 గంటలకు.అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరగనున్నట్టు వారు మంత్రికి వివరించారు.
ధర్మపురి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిలుముల లక్ష్మన్ .. జైన గ్రామ సర్పంచ్ గడ్డి లక్ష్మి రాజన్న, మాజీ ఉపసర్పంచ్ కోరుట్ల శ్రీనివాస్, అంబేద్కర్ కమిటీ గౌరవ అధ్యక్షులు నేతకానీ సంఘము రాష్ట్ర ప్రధానకార్యదర్శి టేకుమట్ల ప్రభాకర్ , నాయకులు దుర్గం బుచ్చన్న ,దుర్గం రాజేందర్, కుంటాల సతీష్.. మరియు అంబేద్కర్ కమిటీ సభ్యులు తదితరు మంత్రాన్ని కలసి ఆహ్వానించారు.
