👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !
J.SURENDER KUMAR,
హైదరాబాద్ మెట్రోకు IRFC నుంచి రుణం విషయమై రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో చర్చలు సానుకూలంగా జరిగాయని ముఖ్యమంత్రి .రేవంత్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి ఢిల్లీలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి తో పాటు అశ్వినీ వైష్ణవ్ తో భేటీ అయ్యారు.

సమావేశం అనంతరం ముఖ్యమంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రైల్వే మంత్రి తో చర్చలు సానుకూలంగా సాగాయన్నారు. ఈ అంశంపై కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో మంగళవారం ఉదయం భేటీ అవుతామని వెల్లడించారు.
