ఆంబులెన్స్‌ లు ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి !

J SURENDER KUMAR,

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ప్రారంభించారు.


👉 ఎంసీఆర్ హెచ్ఆర్‌డీలో జరిగిన కార్యక్రమంలో హెచ్‌డీఎఫ్‌సీ సమకూర్చిన రెండు ఆంబులెన్స్‌లకు ముఖ్యమంత్రి  జెండా ఊపి ప్రారంభించారు. భూపాలపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన ఎంఆర్ఐ స్కానర్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు.


👉 ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  బ్యాంకు ప్రతినిధులతో మాట్లాడుతూ, స్వయం సహాయక సంఘాల నుంచి రుణాల చెల్లింపులు సక్రమంగా జరుగుతున్నాయని పేర్కొంటూ మహిళా సంఘాలకు విరివిగా రుణాలు మంజూరు చేయాలని చెప్పారు.


👉 స్వయం సహాయక సంఘాలతో లాజిస్టిక్ పార్కులు, గోడౌన్లు, రైస్ మిల్లులు ఏర్పాటు చేస్తున్నామని, అందుకోసం పెద్ద ఎత్తున రుణాలివ్వాలని కోరారు.


👉 ఈ కార్య‌క్ర‌మంలో పలువురు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు , హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.