అంగన్వాడి భవనం ప్రారంభించిన మంత్రి లక్ష్మణ్ కుమార్ !

J. SURENDER  KUMAR,

ధర్మపురి నియోజకవర్గ గొల్లపల్లి మండలం గంగాదేవిపల్లె గ్రామంలో నూతనంగా నిర్మించిన అంగన్వాడి భవనాన్ని సోమవారం  రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  ప్రారంభించారు.

👉 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,….

చిన్నారుల సమగ్ర వికాసానికి, గర్భిణులు, బాలింతలకు మెరుగైన సేవలు అందించడంలో అంగన్వాడి కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన మౌలిక వసతులు కల్పిస్తూ, ప్రతి చిన్నారికి మెరుగైన విద్య, పోషకాహారం, ఆరోగ్య సేవలు అందేలా కృషి చేస్తోందని పేర్కొన్నారు.

నూతన అంగన్వాడి భవనం ద్వారా గ్రామంలోని చిన్నారులు, మహిళలకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు యూనిఫాం అందజేశారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, అంగన్వాడి సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.