👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J .SURENDER KUMAR,
ప్రజలకు ప్రభుత్వ విధానాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను చేరవేయడంలో మీడియా కీలకమైన వారధిగా పనిచేస్తుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
సోమవారం జగిత్యాల కలెక్టరేట్ లో జరిగిన కార్యక్రమంలో జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టులకు 2026-28 సంవత్సరమునకు గాను అక్రిడిటేషన్ నూతన అక్రిడేషన్ కార్డులను మంత్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, జిల్లా పౌర సంబంధాల అధికారి వి. శ్రీధర్, విలేకరులు పాల్గొన్నారు.
👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ...

ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియా నాలుగో స్థంభమని, ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో మీడియా పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. వాస్తవాలను నిష్పాక్షికంగా ప్రజలకు అందిస్తూ సమాజాభివృద్ధికి జర్నలిస్టులు చేస్తున్న సేవలు ప్రశంసనీయమని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని, వారి సంక్షేమం కోసం అనేక చర్యలు చేపడుతోందని మంత్రి తెలిపారు. అక్రిడిటేషన్ కార్డులు జర్నలిస్టుల విధి నిర్వహణలో ఎంతో ఉపయోగపడతాయని బాధ్యతాయుతమైన వార్తలతో ప్రజల విశ్వాసాన్ని మరింత పెంచాలని కోరారు.
👉 ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ…
ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వానికి, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో మీడియా వారధిగా నిలుస్తోందన్నారు. జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో జర్నలిస్టులు అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొన్నారు.

👉 కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ…
ప్రభుత్వ సమాచారాన్ని ప్రజలకు వేగంగా, పారదర్శకంగా చేరవేయడంలో మీడియా పాత్ర ఎంతో కీలకమని అన్నారు. జర్నలిస్టులు వాస్తవాలను ధృవీకరించి బాధ్యతాయుతమైన వార్తలను అందించాలని సూచించారు. జిల్లా యంత్రాంగం తరఫున మీడియాకు ఎల్లప్పుడూ అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. అనంతరం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులను అందజేశారు.
👉 నూతన జంటను ఆశీర్వదించిన మంత్రి లక్ష్మణ్ కుమార్!

పెగడపల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పురుషోత్తమ అనిల్ గౌడ్ సోదరి వివాహం ఇటీవల జరిగింది. మంత్రి లక్ష్మణ్ కుమార్ సోమవారం మద్దులపల్లి గ్రామంలోని వారి స్వగృహానికి వెళ్లి నూతన వధూవరులు శైలజ–పరుశురాం దంపతులను ఆశీర్వదించారు.
