👉 మాజీ మంత్రులు జీవన్ రెడ్డి కొప్పుల ఈశ్వర్ కు సవాల్ !
👉 ప్రాణం ఉన్నంతవరకు పదవుల కోసం పార్టీ మారాను
మంత్రి అడ్లూరి !
J.SURENDER KUMAR,
మీరు కోరుకున్న స్థలము, సమయం లో నాపై ఇసుక అక్రమ రవాణా, వరి ధాన్యం కొనుగోలులో వాటాలు అంటూ మీ రాజకీయ ఉనికి కోసం చేసిన అర్థంపర్థం లేని ఆరోపణలు నిరూపించండి, నా పదవులకు స్పీకర్ ఫార్మేట్ లోనే రాజీనామా చేయడానికి సిద్ధం అంటూ, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ మంత్రులు జీవన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ కు బహిరంగ సవాలు చేశారు.
తెలంగాణ ప్రదేశ్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) పై ధర్మపురి నియోజకవర్గ బూత్ లెవెల్ పోలింగ్ ఏజెంట్ల శిక్షణా కార్యక్రమం సోమవారం ధర్మపురి లోని ఎస్ హెచ్ గార్డెన్ లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తన ప్రసంగంలో ఆవేదన వ్యక్తం చేశారు..
నా ఊపిరి ఉన్నంతవరకు, నాకు భగవంతుడు నాకు ఏదయితే శక్తిని ఇచ్చాడో అప్పటి నుంచి నా ప్రాణం పోయేంతవరకు కూడా నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీని, నమ్ముకున్న కార్యకర్తలను, నమ్ముకున్న ప్రజలను మోసం చేయను. ఎప్పుడు వారిని విడిచి పారిపోను. నిజాయితీగా పార్టీని నమ్ముకున్నా, ప్రజలను నమ్ముకున్నా, వాళ్ల ప్రేమాభిమానాలు, కష్టార్జితం, శ్రమతో, ఎమ్మెల్యేగా గెలిచాను మంత్రి పదవి చేపట్టాను, పదవుల కోసం పార్టీ మారను , ప్రజలను మోసం చెయ్యను సంతు మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
👉 జీవన్ రెడ్డి కొప్పుల ఈశ్వర్ ఇద్దరు నాయకులు అబద్దాలతో కాంగ్రెస్ పార్టీని బలహీనం చేయాలని చూస్తున్నారని మాజీ మంత్రులు చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పి కొట్టాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై ఉందని అన్నారు.
👉 మాజీ మంత్రి జీవన్ రెడ్డి విధంగా, నాయకులను వర్గాలుగా విభజించి మాట్లాడడం తనకు తెలియదని అన్నారు. ప్రాణం ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన ప్రతి కార్యకర్తకు వెన్నుదన్నుగా నిలుస్తానని మంత్రి తెలిపారు.
👉 తాను అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఎలాంటి కక్ష సాధింపులు లేకుండా ముందుకు సాగుతున్నానని సోషల్ మీడియాలో కొంత మంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని వాటిని తిప్పికొట్టాలని నాయకులు, కార్యకర్తలకు మంత్రి అడ్లూరి పిలుపునిచ్చారు.
👉 మీ విధంగా ఒక వర్గాన్ని పెంచి, మరో వర్గంతో ఇంకొక వర్గం పై కలెక్టర్ కు ఫిర్యాదు ఇప్పించి, రాజకీయ పబ్బం గడపడం నాకు రాదని మంత్రి అన్నారు.
👉 కడుపునిండా కుట్ర పెట్టుకొని, రెండు సంవత్సరాలకే ఈ రాజ్యం అంతా ఏమో మునిగిపోయింది అన్నట్టు, వాళ్లేదో మొనగాళ్లు అన్నట్టు, వాళ్లేదో ఈ ప్రాంతాన్ని ఉద్ధరించినట్టు మాట్లాడే నాయకులకు ఏమాత్రం పౌరుషం ఉన్నా, మాట మీద నిలబడే శక్తి ఉన్నా నా సవాలు స్వీకరించాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ మరో మారు డిమాండ్ చేశారు.
👉 ఆరు సార్లు ఎమ్మెల్యే, రెండు సార్లు మంత్రి అయిన పెద్ద మనిషికి చెప్తున్నా. నేనే రాజు, నేనే మంత్రి, నాకెవడు గొప్పోడు, నాకెవరూ ఎదురు లేరని మాట్లాడుతున్న కొప్పుల ఈశ్వర్ కి చెప్తున్నా, నీ భజన పరులకు చెప్తున్నా, రాజకీయా ఉనికి కోసం అబద్ధపు ఆరోపణలు చేయవద్దు అను మంత్రి హెచ్చరించారు.
👉 జీవన్ రెడ్డి అంటుంటాడు… లక్ష్మణ్ కుమార్ కు ఏం తెలుసయ్యా ? ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే , బడ్జెట్ తెలుసా. అని ,నిజమే, పెద్దపల్లి వాసిని. సింగరేణిలో బొగ్గుబాయి కార్మికుడి కొడుకుని, కానీ. నాకు తెలిసింది ఒకటే పార్టీని నమ్ముకున్నా, ఒకటే జెండాను నమ్ముకున్నా. కార్యకర్తలను నమ్ముకున్నా తప్ప, పదవుల కోసం, స్వార్థం తో పార్టీ మారను. నా ప్రాణం పోయేంతవరకు ఈ మూడు రంగుల జెండాని మీద వేసుకొని చనిపోతా తప్ప నేను పార్టీ మారను. మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
