👉 కేక్ కట్ చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలను ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలో సోమవారం ఘనంగా నిర్వహించారు.
స్థానిక ఎస్ హెచ్ గార్డెన్లో నిర్వహించిన వేడుకల్లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని కేక్ కట్ చేశారు.
👉 ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ…
మృదు స్వభావి మల్లు భట్టి విక్రమార్క మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర పురోభివృద్ధిలో భట్టి పాత్ర కీలకమని మంత్రి అన్నారు. కెసిఆర్ పాలన లో గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే పనిలో భట్టి విక్రమార్క గారు తన చతురతను ప్రదర్తిస్తున్నారని మంత్రి అన్నారు.
