👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J SURENDER KUMAR,
తెలంగాణ రాష్ట్ర విద్యార్థుల్లో అపారమైన ప్రతిభ ఉందని, వారికి సరైన అవకాశాలు, మార్గదర్శకత్వం అందిస్తే ప్రపంచ స్థాయిలో రాణించగలరని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలతో కలిసి నిర్వహించిన విద్యార్థి కిట్ పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి కాకుండా విద్య, కృషి, సంకల్పమే నిర్ణయిస్తాయని పేర్కొన్నారు.
గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు భవిష్యత్తులో ఐఏఎస్ అధికారులు, వైద్యులు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలుగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు యూనిఫాంలు, షూస్, పుస్తకాలు అందిస్తూ ప్రభుత్వం వారి అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు.

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్టడీ సర్కిల్ ద్వారా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నత సేవల్లో స్థానం సంపాదించడం ప్రభుత్వ విద్యా విధానాల విజయానికి నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు.
