ధర్మపురి నియోజకవర్గానికి ₹ 13 కోట్ల నిధులు !

👉 ఎంఎన్‌ఆర్‌ఈజీఎస్‌ గ్రాంట్ కింద ₹.13.25 కోట్లతో 245  పనులకు పరిపాలన అనుమతులు!

👉 మంత్రి లక్ష్మణ్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ !


J.SURENDER KUMAR,


ధర్మపురి నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంఎన్‌ఆర్‌ఈజీఎస్‌ (MGNREGS) 2026-27 పథకం కింద ₹ 1325.80 లక్షల (₹ 13.25 కోట్లు) వ్యయంతో 245 సీసీ రోడ్లు మరియు డ్రైనేజీ పనులకు పరిపాలన అనుమతులు మంజూరు చేయడం పట్ల ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిలుముల లక్ష్మణ్  హర్షం వ్యక్తం చేస్తూ ఇట్టి నిధుల మంజూరు చేయించిన మంత్రి  అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు.

నిధులు విడుదల ఉత్తర్వులు (ఫైల్ ఫోటో)

👉 వివరాలు ఇలా

👉 ధర్మపురి మండలానికి– 40  పనులకు గాను ₹ 2. కోట్ల 73. లక్షల 80 వేలు !

👉 గొల్లపల్లి మండలానికి -56 పనులకు ₹ 3 కోట్ల 25 లక్షల 50 వేలు!

👉 పెగడపల్లి  మండలానికి – 53 పనులకు ₹ 2 కోట్ల 41 లక్షల  50 వేలు!

👉 వెలగటూర్ మండలానికి- 38 పనులకు ₹ 1 కోటి 64 లక్షల 50 వేలు.!

👉 ఎండపల్లి  మండలానికి – 36 పనులకు ₹ 2 కోట్ల 12 లక్షలు !

👉 బుగ్గారం మండలానికి- 22 పనులకు ₹ 1 కోటి 8 లక్షల 50 వేలు !

గ్రామాల్లో మెరుగైన రహదారి సౌకర్యాలు, మురుగు నీటి పారుదల వ్యవస్థ, పరిశుభ్రత, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు ఈ పనులు ఎంతగానో దోహదపడతాయని చిలుముల లక్ష్మణ్ ఆశాభావం వ్యక్తం చేశారు.