J.SURENDER KUMAR,
జగిత్యాల జిల్లా ధర్మపురి కోర్టు ఏర్పడినప్పటి నుంచి కోర్టు కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ బదిలీపై వెళ్తున్న సింహాచలం రాము ను ధర్మపురి కోర్టు ఆవరణలో శుక్రవారం ఘనంగా సన్మానించి వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా న్యాయమూర్తి యేగి జానకి మాట్లాడుతూ, సింహాచలం రాము విధి నిర్వహణలో అంకితభావం, క్రమశిక్షణతో పనిచేస్తూ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది అందరి మన్ననలు పొందారని అన్నారు. కోర్టు అభివృద్ధికి, విధుల నిర్వహణకు ఆయన అందించిన సేవలను కొనియాడుతూ, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆమె ఆకాంక్షించారు.
అనంతరం న్యాయవాదులు, కోర్టు సిబ్బంది శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీఐ రాం నరసింహారెడ్డి, ధర్మపురి ఎస్ఐ మహేష్, వెల్గటూర్ ఎస్ఐ ఉదయ్, బుగ్గారం ఇన్‌చార్జ్ ఎస్ఐ రవీందర్, ఏజీపీ ఇమ్మడి శ్రీనివాస్, లీగల్ ఎయిడ్ కౌన్సిల్ జాజాల రమేష్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బందేల రమేష్, వైస్ ప్రెసిడెంట్ మామిడాల శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి రామడుగు రాజేష్, సీనియర్ న్యాయవాదులు గడ్డం సత్యనారాయణరెడ్డి, అప్పాల నిరంజన్, రౌతు రాజేష్, న్యాయవాదులు బత్తిని ఇంద్రకరణ్, కలమడుగు హరిప్రసాద్, కోర్టు సూపరింటెండెంట్ భీష్మాచారి, ఇతర న్యాయవాదులు మరియు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
