J SURENDER KUMAR,
మావోయిస్టు సుప్రీం ముప్పాల లక్ష్మణరావు @ గణపతి సోదరుడు ముప్పాల నర్సింగరావు (81) ( రిటైర్డ్ హ్యాండ్లూమ్ టెక్స్టైల్ డైరెక్టర్ ) ఆదివారం పగలు హైదరాబాదులో మృతి చెందారు. వీరి అంతక్రియలు మంగళవారం హైదరాబాదులో జరగనున్నట్టు వారి సమీప బంధువులు తెలిపారు.
గణపతి ముగ్గురు సోదరులలో పెద్దవాడు నరసింహారావు, కొంతకాలం క్రితం చిన్న సోదరుడు రామచంద్ర రావు మృతి చెందారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉమ్మడి రాష్ట్రంలో 1989 సెప్టెంబర్ మాసంలో పీపుల్స్ వార్ నక్సల్స్ బీర్పూర్ ఘాట్ రోడ్లో మొట్టమొదటిసారి మందు పాతర లతో పోలీసులను హతమార్చడానికి పేల్చిన మందు పాతర వికటించి 14 మంది అమాయకులు మృతి చెందిన విషయం తెలిసిందే.

పోలీస్ ఉన్నతాధికారులను సంఘటనా స్థలానికి ( వార్ కిల్లింగ్ ) జోన్ లోకి రప్పించడానికి నక్సల్స్ రాత్రి బీర్పూర్ గ్రామంలో గణపతి వదిన తండ్రిని ( నర్సింగరావు స్వయాన మామ) వంగపల్లి తిరుపతిరావు ను తల మొండెం వేరు చేశారు.
నాటి ఎన్కౌంటర్ స్పెషలిస్టులుగా ప్రచారంలో ఉన్న జగిత్యాల డివిజన్ డిఎస్పి, వేణుగోపాలకృష్ణ, నర్సింగరావు పోలీసు బలగాలతో మరో మార్గం ధర్మపురి గుండా బీర్పూర్ చేరుకున్నారు.
