దొర కు ఎస్సీ బీసీ మైనార్టీ మంత్రుల పై ఎందుకంత కక్ష ?

👉 సంక్షేమ శాఖలో అవినీతి నిరూపిస్తే ముగ్గురం రాజీనామా చేస్తాం !

👉 ఆవేదన వ్యక్తం చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J SURENDER KUMAR,

మా ప్రజా ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేస్తున్న ఎస్సీ, బీసీ, మైనార్టీ మంత్రులు అంటే  మాజీ మంత్రి హరీష్ రావు దొర కు  ఎందుకు అంత కక్ష, కోపమని రాష్ట్ర ఎస్సీ, ఎస్ టి, దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ  శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి బుధవారం కరీంనగర్ లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాల నుండి పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.


గతంలో ఎదుర్కొన్న అవమానాలను గుర్తు చేసుకుంటూ, ప్రస్తుతం తమపై వస్తున్న ఆరోపణల పట్ల  మంత్రి లక్ష్మణ్ కుమార్ భావోద్వేగానికి లోనయ్యారు. ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన మంత్రులపై మాజీ మంత్రి హరీష్ రావు పదే పదే టార్గెట్ చేస్తూ   విమర్శలు చేయడం వెనుక ఉన్న కారణమేంటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ…

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎస్సీ, బీసీ, మైనార్టీ మంత్రులను చూలకనగా చూశారని అన్నారు. నాటి హోం శాఖ మంత్రిగా ఉన్న మహమూద్ అలీ ని ప్రగతి భవన్ ముందు గంటల తరబడి నిలబెట్టి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడకుండా పంపించారని మంత్రి లక్ష్మణ్ కుమార్ గుర్తు చేశారు. అదే విధంగా ఆనాటి బీసీ మంత్రి ఈటెల రాజేందర్ ను సైతం అవమానాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం గురి చేసిందని మంత్రి అన్నారు.


👉 ప్రస్తుతం ప్రజా ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగుతున్న మాపై  హరీష్ రావు దొర తప్పుడు ఆరోపణలు చేస్తు,  తమ పై జాలి చూపుతు ఆరోపణలు చేస్తున్నారని, మంత్రి  అన్నారు.

👉 తమ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఎస్సీ, బీసీ, మైనార్టీ మంత్రులపై మాజీ మంత్రి హరీష్ రావు చేస్తున్న ఆరోపణలు తీవ్ర మనస్తాపానికి గురిచేస్తున్నాయని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

👉 తమ శాఖలో తమకు తెలియకుండా ఏమీ జరగవని మంత్రి అడ్లూరి స్పష్టం చేశారు. హరీష్ రావు దొర, ఎస్సీ, బీసీ, మైనార్టీ మంత్రులను అదే పనిగా అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నారని మంత్రి అడ్లూరి ఆవేదన వ్యక్తం చేశారు.

👉 సెంట్రల్ ప్రోక్యూర్ ట్మెంట్ టెండర్లలో ఏలాంటి అవకతవకలు జరగలేదని పూర్తి స్థాయిలో పారదర్శకంగా టెండర్లు జరిగినట్లు మంత్రి స్పష్టం చేశారు.

👉 విద్యార్థులకు సంబంధించిన వస్తువుల కొనుగోలుకు ₹ 683 కోట్ల ప్రభుత్వ రంగ సంస్థలైన లీడ్ క్యాప్, చేనేత రంగ సంస్థలకు ₹ 500 కోట్ల కాంట్రాక్టులు ఇచ్చామని మంత్రి తెలిపారు. ₹ 1142 కోట్ల సెంట్రల్ ప్రోక్యూర్ ట్మెంట్ జరిగితే ₹ 2వేల కోట్ల అవినీతి జరిగిందని హరీష్ రావు ఆరోపించడం విడ్డూరంగా ఉందని మంత్రి అన్నారు.

👉 టెండర్లలో ₹ 2వేల కోట్ల అవినీతి జరిగినట్లు నిరూపిస్తే ముగ్గురు మంత్రులం రాజీనామా చేస్తామని మంత్రి లక్ష్మణ్ కుమార్ మరో మారు స్పష్టం చేశారు.

👉 గత ప్రభుత్వ కాలంలో విద్యార్థులకు కనీసం డైట్, కాస్మెటిక్, చార్జీలు పెంచలేదని ఆరోపించారు. ఒక్క గురుకుల పాఠశాలకు కనీసం నూతన భవనం నిర్మించలేదని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ప్రజా ప్రభుత్వంలో 27 లక్షల మంది విద్యార్థులకు బీసీ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖల ద్వారా నాణ్యమైన భోజనం మంచి దుస్తులు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి తెలిపారు


👉 పేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థుల జీవన ప్రమాణాలు మెరుగుపడటాన్ని కూడా రాజకీయ విమర్శలకు వేదికగా మార్చడం బాధాకరమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.

.