👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వానికి ఉత్తరం రాసే బదులు దమ్ము ధైర్యం ఉంటే ప్రత్యక్షంగా, పరోక్షంగా బీఆర్ఎస్ కు సహకరిస్తున్న బిజెపి ప్రభుత్వంతో విచారణ చేయించమని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు.
👉 బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వి డైవర్షన్ పాలిటిక్స్ అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణిలో ₹1600 కోట్ల అవినీతి జరిగిందని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై శనివారం మండలంలో మీడియా అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు.
👉 బీఆర్ఎస్ పార్టీ రోజురోజుకి ప్రజల్లో విశ్వాసం కోల్పోతుందని మంత్రి అన్నారు. పార్టీని కాపాడుకోవడానికి కేటీఆర్ ప్రభుత్వం పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.
👉 మాజీ ముఖ్యమంత్రి ఫామ్ హౌజ్ కు పరిమితం కావడం, ఇంట్లో కుటుంబ గొడవల నేపధ్యంలో ఏం చేయాలో తెలియని కేటీఆర్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
