👉 ‘బారాస పార్టీ మంథని’ ఫేస్ బుక్ పేజీలో పోస్టులు !
👉 కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు !
J.SURENDER KUMAR,
రాష్ట్ర ఐటి, పరిశ్రమ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఆయన సతీమణి సీనియర్ ఐఏఎస్ అధికారిని శైలజ రామ అయ్యార్ దంపతులపై క్రియేట్ చేసిన తప్పుడు వీడియోలను సర్కులేట్ చేసిన BRS Party Manthani” ఫేస్‌బుక్ పై న్యాయవాది శశి భూషణ్ కాచే, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ అధికారులకు చేసిన ఫిర్యాదు మేరకు. సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.

మంత్రి శ్రీధర్ బాబు, మరియు తెలంగాణ ప్రభుత్వ దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, సీనియర్ ఐఏఎస్ అధికారిని శ్రీమతి శైలజ రామయ్యర్, లపై అవమానకరమైన, అసభ్యకరమైన, మరియు AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ద్వారా మార్ఫింగ్/మార్చబడిన కంటెంట్‌ను ప్రచురించినందుకు గాను “BRS Party Manthani” ఫేస్‌బుక్ పేజీ నిర్వాహకులపై క్రిమినల్ కేసు నమోదు చేయాల్సిందిగా ఫిర్యాదులో న్యాయవాది పేర్కొన్నారు.

ఇలాంటి తప్పుడు కంటెంట్ ద్వారా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధి కారుల ప్రతిష్ఠకు భంగం కలుగుతుందని, ఇది రాజకీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. Cr. No. 436/2026, U/Sec 336(4), 353(2), 352 BNS కింద కేసు నమోదు చేసి సైబర్ పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.
