మంత్రిగా కాదు మీ కుటుంబ సభ్యుడిగా ఉంటాను !

👉 మీ సమస్యల పరిష్కార నా బాధ్యత నాది !

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

దివ్యాంగుల కష్టాలు తనకు బాగా తెలుసని, తాను కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చానని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  అన్నారు. మీకు మంత్రిగా కాదు… మీ కుటుంబ సభ్యుడిగా అండగా ఉంటాను. మీ సమస్యల పరిష్కార  బాధ్యత నాది అని హామీ ఇచ్చారు.

హెలెన్ కెల్లర్ 146వ జయంతి సందర్భంగా శనివారం హైదరాబాద్‌లోని దివ్యాంగుల సంక్షేమ శాఖ రాష్ట్ర సంచాలకుల కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు..

👉 ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..


ఈ రోజు బెంచ్‌పై కూర్చున్న విద్యార్థే , రేపు కలెక్టర్ లు కావచ్చు. ఐఏఎస్, ఐపీఎస్, శాస్త్రవేత్తలు, వైద్యులు, న్యాయమూర్తులు, పారిశ్రామికవేత్తలు మీలో నుంచే రావాలి. మీ పేరు ముందు ‘దివ్యాంగుడు’ కాదు… ‘విజేత’ అని సమాజం పిలిచే రోజు రావాలి” అని మంత్రి ఆకాంక్షించారు.


👉 మీరు జాలి కోరే వారు కాదు, అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టించే ప్రతిభావంతులు.
మీ వైకల్యం మీ గుర్తింపు కాదు, మీ విజయం మీ అసలైన గుర్తింపు.”మీ లోపాన్ని ప్రపంచం గుర్తుంచుకోదు, మీరు సాధించిన విజయాన్ని మాత్రమే చరిత్ర గుర్తుంచుకుంటుంది.” అని మంత్రి అడ్లురి ఉద్బోధించారు.


👉 దేశంలో దృష్టిలోపాన్ని అధిగమించి సివిల్ సర్వీసుల్లో అత్యున్నత విజయాలు సాధించిన పలువురు యువతను ఉదాహరణగా పేర్కొంటూ, కుటుంబం, పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే ఏ లక్ష్యమైనా సాధ్యమేనని చెప్పారు.


👉 గత పాలకులు దాదాపు పదేళ్లపాటు దివ్యాంగుల సమస్యలను పట్టించుకోలేదని, మా సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం మాత్రం వారి ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా నిర్ణయాలు తీసుకుంటోందన్నారు.


👉 త్వరలో జావేద్ అబిద్ విగ్రహం ఏర్పాటు చేస్తానని మంత్రి అడ్లూరి హామీ ఇచ్చారు.వికలాంగుల హక్కుల కోసం పెద్ద ఎత్తున పోరాటం చేసి వారి సంక్షేమం కోసం పాటుపడిన జావేద్ విగ్రహాన్ని ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తానన్నారు.


👉 అవరోధాలను అవకాశాలుగా మార్చుకుందాం… పరిమితులను విజయాలుగా మలుచుకుందాం… ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుదాం… తెలంగాణ అభివృద్ధి గాథలో మన విజయాలను స్వర్ణాక్షరాలతో లిఖిద్దాం” అని మంత్రి  లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు.


ఈ సందర్భంగా పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుతున్న ప్రతిభావంతులైన పలువురు దివ్యాంగ విద్యార్థులకు మంత్రి చేతుల మీదుగా ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, ఇతర సహాయక పరికరాలు అందజేశారు. ఈ సందర్భంగా దివ్యంగా విద్యార్థులతో కలిసి మంత్రి భోజనం చేశారు