👉 మీ కోసం ఎంతైనా కష్టపడుతా, మీ సమస్యలను పరిష్కరిస్తా…
👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !
J SURENDER KUMAR,
పరకాలలో ప్రజా పాలన ప్రగతి బాట వరంగల్ ఉమ్మడి జిల్లా పర్యటనలో భాగంగా వివిధ అభివృద్ధి పనులు శంకుస్థాపనలు చేసిన అనంతరం జరిగినబహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , గత బీఆర్ఎస్ ప్రభుత్వ తీరును కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సామాజిక న్యాయం తీరును సీఎం ఎండగట్టారు.
👉 సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగంలో హైలెట్స్ !
ఆ నాడు కెసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఆయన కొడుకు కేటీఆర్, అల్లుడు హరీష్ ను మంత్రులను చేసుకుండు!
👉 కానీ నేను ముఖ్యమంత్రి మా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు మంత్రి పదవి ఇచ్చా !
👉 మా సీతక్క, కొండా సురేఖను మంత్రులను చేశా !
కెసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఎర్రబెల్లి దయాకర్ రావుకు మంత్రి పదవి ఇచ్చిండు!
👉 వరంగల్ జిల్లాకు ఒక గొప్ప చరిత్ర, చైతన్యం ఉంది!
👉 పాలకుల అణచివేతకు గురైన ప్రతీ సందర్భంలో వరంగల్ జిల్లా చైతన్యాన్ని ప్రదర్శించింది కదా!
👉 తమకు ఎదురు లేదన్నవాళ్లని మట్టికరిపించిన చరిత్ర ఈ గడ్డది!
👉 పాలకుర్తిలో మా యశస్విని రాజకీయ కొండను బద్దలు కొట్టింది!
👉 ఇచ్చిన మాట తప్పకూడదని రోజుకు 18 గంటలు పనిచేస్తున్నాం!
👉 కాళేశ్వరం కూలేశ్వరమైనా ప్రాజెక్టులను నింపి రైతులు అత్యధిక పంటలు పండించేలా చర్యలు తీసుకున్నాం!
👉 ఈ 32 నెలల్లో ధాన్యం కొనుగోలు చేసి 90 వేల కోట్లు రైతులకు చెల్లించాం !
👉 రైతు భరోసా, రైతు రుణమాఫీ చేసి రైతును రాజును చేయాలని ప్రయత్నిస్తున్నాం!
👉 రెండున్నరేళ్లలో రైతుల కోసం లక్ష కోట్లు ఖర్చు చేశాం.!
👉 రైతులు పండించిన సన్న ధాన్యానికి బోనస్ అందించిన మాట వాస్తవం కాదా ?
👉 మా ప్రభుత్వంలో ఇద్దరు ఆడబిడ్డలను మంత్రులుగా చేశాం!
👉 సున్నా వడ్డీ రుణాలకు గత ప్రభుత్వం గుండు సున్నా పెట్టింది!
👉 కానీ మా ప్రభుత్వం సున్నా వడ్డీ రుణాలు అందించింది.!
👉 మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకున్నాం!
👉 యూనిఫాం కట్టు పనిని మహిళా స్వయం సంఘాలకు అప్పగించాం!
👉 సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు జరుపుకునేలా ప్రోత్సహించాం!
👉 రక్తం పంచుకున్న సోదరికి సాయం చేయాల్సి వస్తుందని ఇంటి నుంచి బయటికి గెంటేసిన చరిత్ర కేటీఆర్ ది!
👉 కొడుకుకు బుద్ధి చెప్పాల్సిన కన్న తండ్రి కళ్లున్న ద్రుతరాష్టుడిలా మారిపోయాడు!
👉 కానీ మీ సోదరుడు ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీరను సారెగా పెట్టి గౌరవించుకుంటున్నాడు!
👉 పదేళ్లు ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులను బలి తీసుకున్నారు!
👉 ప్రజా ప్రభుత్వంలో 72 వేల ప్రభుత్వ ఉద్యోగాల నియామకం పూర్తి చేశాం!
👉 పోలీస్ ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్లు ఇచ్చాం!
👉 నిరుద్యోగుల భవిష్యత్ కోసమే వయసు సడలించాం!
👉 నిరుద్యోగులు రాజకీయ పట్టీలు మాయ మాటలకు మోసపోవద్దు!
👉 ప్రతీ ఆరునెలలకు ఉద్యోగ ఖాళీలను గుర్తించి భర్తీ చేస్తాం!
👉 ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత మాది.. పరీక్షలకు సిద్ధం కావాల్సిన బాధ్యత మీది.!
👉 ఆనాడు అధికారం అనుభవించారు ..
👉 కార్యకర్తల రక్తాన్ని ప్రైవేటు ఆసుపత్రులకు అమ్ముకుంటున్న రక్తపిపాసులు!
👉 రైతులు, ఆడబిడ్డలు, నిరుద్యోగుల కోసమే మన ప్రభుత్వం పనిచేస్తుంది!
👉 సెప్టెంబరులో శాసనసభ సమావేశాలు నిర్వహిస్తాం!
👉 కెసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఆయన బిడ్డను ఎంపీని చేసుకుండు, ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చిండు!
👉 నేను మా కావ్యను ఎంపీగా , యశస్వినిని ఎమ్మెల్యే గా చేశా!
👉 కెసీఆర్ ముఖ్యమంత్రి అయితే సడ్డకుని కొడుకు సంతోష్ రావుని ఎంపీని చేసుకుండు!
👉 నేను మిత్ర ధర్మంగా వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ ఇచ్చా!
👉 కెసీఆర్ ముఖ్యమంత్రి అయితే వినోద్ రావును ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ గా చేసుకుండు!
👉 నేను ఉద్యమ కారుడు కోదండరాం కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చా!
👉 కెసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఆయన కొడుకు కేటీఆర్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ చేసుకున్నాడు!
👉 నేను మహేష్ గౌడ్ ను పీసీసీ అధ్యక్షుడిగా చేశా!
👉 కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఆయన కుటుంబానికే లాభం!
👉 ప్రజా పాలనతో ప్రజలకు లాభం!
👉 ఎవరు ముఖ్యమంత్రి అయితే ఎవరికి లాభం అయిందో లెక్కలతో చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం!
👉 2029 లో రెట్టింపు మెజారిటీతో ఇక్కడి ఎమ్మెల్యేలను గెలిపించాలి!
👉 మాది సామాన్యుల కోసం పనిచేసే ప్రభుత్వం మాది..!
👉 మీ ఆశీర్వాదం ఉన్నత కాలం వెయ్యి మంది కేసీఆర్ లు వచ్చినా వెంట్రుక కూడా పీకలేరు!
