మృతుడి కుటుంబాన్ని ఆదుకుంటాం !

👉 ఆసుపత్రిలో మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

విద్యుత్ ప్రమాదంలో మరణించిన కట్ట అశోక్ కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా అన్ని విధాల ఆదుకుంటామని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

ధర్మపురి నియోజకవర్గం ( పెద్దపల్లి జిల్లా ) ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలో సోమవారం జరిగిన విద్యుత్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కట్ట అశోక్ కు మెరుగైన వైద్య సేవల కోసం హైదరాబాద్ కార్పొరేటర్ ఆస్పత్రి యశోదకు, గాంధీ ఆస్పత్రికి  తరలించారు. చికిత్స పొందుతూ అశోక్ మంగళవారం మృతి చెందారు.

అశోక్ మృతి చెందిన  సమాచారం తెలిసిన మంత్రి  లక్ష్మణ్ కుమార్  హుటాహుటిన  ఆసుపత్రికి చేరుకొని అశోక్ మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
నంది మేడారం గ్రామంలో విద్యుత్ మరమ్మత్తులు చేస్తుండగా కట్ట అశోక్ అని ప్రైవేట్ ఎలక్ట్రిషన్ విద్యుత్ షాక్ తో తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. 

గాయపడిన అశోక్ ను మొదట కరీంనగర్ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం అక్కడి నుండి హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగ పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అశోక్ మృతి చెందారు.

తాత్కాలిక అవసరాల నిమిత్తం  మంత్రి లక్ష్మణ్ కుమార్ నీ కుటుంబ సభ్యులకు ₹ 20 వేల  ఆర్థిక సహాయం అందించారు.


👉 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ….

బాధిత కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా అన్ని విధాల ఆదుకుంటామని అన్నారు. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులు మనోధైర్యంగా ఉండాలని అన్నారు. ప్రమాదంపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. మంత్రి వెంట నంది మేడారం గ్రామ సర్పంచ్ వీర్ పాల్ తోపాటు ధర్మారం మండలానికి చెందిన వివిధ రాజకీయ పార్టీలకు చెందిన పలువురు  నాయకులు ఉన్నారు.