👉 వన్యప్రాణులకు వనసంపదకు రక్షణ కరువు !
👉 దాడులు చేసిన వారికే దండాలు పెడుతున్న కొందరు ఉద్యోగులు!
👉 కాసుల వర్షం లో కేసులు మాయం ?
👉 అక్రమాలను ప్రశ్నించిన వారిని పరేషాన్ చేస్తున్న వైనం !
👉 బీర్పూర్ అడవులలో మట్టి మాయం – ఉద్యోగుల మౌనం లో మర్మం ఏమిటి ?
J.SURENDER KUMAR,
గత దశాబ్దన్నర కాలం క్రితం వరకు ఆ గ్రామాలలో నక్సలైట్లేదే రాజ్యం, వారి తీరును ప్రశ్నించే వారిని ప్రజా కోర్టులలో శిక్షించేవారు. ప్రస్తుతం ఆ గ్రామాలలో నక్సల్స్ రాజ్యం కనుమరుగైంది. ఆ అడవి గ్రామాలలో అటవీ శాఖ వారి అటవీక రాజ్యం అగుపిస్తున్నది. వన్యప్రాణులు, వన సంపదకు రక్షణ కరువైంది. వేలాది ఎకరాల అడవులలో అక్రమంగా మట్టిని తరలిస్తున్న ఉద్యోగుల మౌనం లో మర్మం ఏమీటో ? తెలియడం లేదు.
అక్రమాలను అడ్డుకున్న అధికారి పై దాడులు జరిగిన పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయించే దమ్ము, ధైర్యం లేని కొందరు ఉద్యోగులు, దాడి చేసిన వారికే సలామ్ కొడుతున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. జగిత్యాల జిల్లా ధర్మపురి అటవీశాఖ రేంజ్ పరిధిలోని బీర్పూర్ మండలంలో గుట్ట కింద గ్రామాల అడవులలో జరుగుతున్న అవినీతి అక్రమాల బాగోతం ఇది.



గుట్ట కింద గ్రామాలలో రిజర్వు అటవీ శాఖ భూముల నుండి నిత్యం పదుల సంఖ్యలో అక్రమంగా మట్టి తరలిపోతున్న ప్లాంటేషన్ నరుకుతున్న అటవీ ఉద్యోగులలో మౌనంగా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు అనే ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి.
👉 మౌనం వెనుక మర్మం ఇదా ?
ఈ ప్రాంతంలో అటవీ శాఖ గిరిజన అధికారి పై ఫిబ్రవరి మాసంలో ఆయన ఇంటిలో అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. , దాడికి పాల్పడిన వారిపై సంబంధిత శాఖ కీలక అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. తమ తోటి అధికారినే మౌనంగా ఉండాలి, వారితో మనకు గొడవలు ఎందుకు ? రాజీ చేసుకోవాలి అంటూ బాధిత అధికారినే భయభ్రాంతులకు గురి చేస్తూ కొన్ని నెలలుగా దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు కాకుండా అడ్డుకుంటున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి.
అటవీశాఖ ఉద్యోగులు తమ విధి నిర్వహణలో అక్రమాలను అడ్డుకుంటే అభినందించాల్సిన ఆ శాఖ కీలక అధికారులే, అక్రమాలకు పాల్పడే వారికే అండదండలు అందించడంతో ఉద్యోగులు మౌనం వహిస్తున్నారు అనే విమర్శలు ఉన్నాయి.
👉 ఇది ఇలా ఉండగా..
గత దశాబ్దన్నర కాలం క్రితం తుంగూరులో విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ రేంజ్ అధికారి రామస్వామి , మంగేల్ బీట్ అధికారి ఓదెలు ను నక్సలైట్లు ప్రజా కోర్టులో దారుణంగా కొట్టారు. నాడు అటవీ శాఖ ఉద్యోగులు, నక్సలైట్ దాడులకు వ్యతిరేకంగా గళం విప్పి నిరసన తెలిపి తమ ఐక్యతను చాటుకున్నారు.
👉 గిరిజన సర్పంచ్ అరెస్టు రిమాండ్ !
గత సంవత్సరం అటవీశాఖ అధికారుల ఆగడాలను ప్రశ్నించిన ఓ గిరిజన సర్పంచ్ పై ఆ శాఖ అధికారి కేసు నమోదు చేసి 14 రోజులపాటు రిమాండ్ తరలించారు.

బెయిల్ పై వచ్చిన గిరిజన సర్పంచ్, రెండు నెలల వరకు మంగేల్ ఆటవిశాఖ అధికారి కి ప్రతి సోమవారం హాజరు కావలసిందిగా కోర్టు బెయిల్ ఉత్తర్వులలో స్పష్టంగా ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆ గిరిజన సర్పంచ్ ను ధర్మపురి రేంజ్ కార్యాలయానికి పిలిపించి అధికారి వేధించేవాడని పలు సందర్భలలో గిరిజన సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు.
👉 ధర్మపురి రేంజ అధికారిపై ఎఫ్ ఐ ఆర్ నమోదు !

తనపై అక్రమంగా కేసు నమోదు చేసి, ఆస్తి నష్టం చేశారు అంటూ, గిరిజన సర్పంచ్ ధర్మపురి రేంజ్ అధికారిపై చేసిన ఫిర్యాదు మేరకు బీర్పూర్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ ఐ ఆర్ సంఖ్య 97/2025. 24/07/2025 న పోలీస్ సెక్షన్లతోపాటు SC.ST.POA ACT కేసు నమోదు చేశారు. ( ఈ కేసు పెండింగ్ లో ఉందా ? తొలగించారా ? అనే అంశంలో స్పష్టత లేదు )
👉 అడవి దున్నుల విచారణ ఏమైంది ?

వన్యప్రాణులను వధించి మాంసం పట్టణాలలో విక్రయించే స్మగ్లర్లు, లేదా , పంట పొలాల రక్షణ కోసం విద్యుత్తు ఏర్పాటు చేసుకున్న వారో అనే అంశంలో స్పష్టత లేదు.. విద్యుత్ షాక్ తో కొన్ని నెలలు క్రితం సారంగాపూర్ మండల అటవీ పరిధి అడవులలో రెండు అడవి దున్నలు అనుమానస్పదంగా మృతి చెందాయని, కొందరు వాటిని బీర్పూర్ మండలం రంగసాగర్ అటవీ ప్రాంతంలో దహనం చేశారు అనేది రెండు మండలాల్లో జరుగుతున్న చర్చ.
వన్యప్రాణులను వధించి మాంసం పట్టణాలలో విక్రయించే స్మగ్లర్లు, లేదా , పంట పొలాల రక్షణ కోసం విద్యుత్తు ఏర్పాటు చేసుకున్న వారో అనే అంశంలో స్పష్టత లేదు..
అరుదైన అడవి దున్నలు ఈ అడవులలో ఉన్నాయా ? ట్రూ కెమెరాలు ఏర్పాటు చేసి వన్యప్రాణుల కదలికలు సంబంధిత శాఖ వారు పరిశీలిస్తున్నారా ? వన్యప్రాణుల సంరక్షణకు ముందస్తుగా ఎలాంటి చర్యలు చేపడుతున్నారు అనే అంశంలో అధికారులు మౌనం ఎందుకు వహిస్తున్నారో అంతు పట్టని చిదంబర రహస్యం.
👉 మట్టిని మాయం చేస్తున్నారు, ప్లాంటేషన్ లో నరుకుతున్నారు!

తుంగూర్, మంగళ సెక్షన్ సెక్షన్ పరిధి అడవులలో జెసిబి యంత్రాలతో అడ్డు అదుపు లేకుండా మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. మట్టి తరలింపు తో ఏర్పడిన గుంతలు వ్యవసాయ బావులను, చిన్నపాటి చెరువులను తలపిస్తున్నాయి.
వనమహోత్సవంలో భాగంగా పలు జిల్లాల్లో మొక్కలు నాటడం, వనాల పెంపుతో పాటు వన్య ప్రాణుల సంరక్షణ, ప్రకృతి సంరక్షణకు సంబంధించి ప్రభుత్వం ఇటీవల ₹ 35.50 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. అయితే తుంగూర్, మంగళ అటవీ ప్రాంతంలో ఏర్పడ్డ గుంతలలో అటవీ శాఖ అధికారులు మొక్కలను ఎలా నాటనున్నారో చూడాల్సిందే.
👉 ఏసీబీ దాడితో వెలుగు చూస్తున్న అక్రమాలు ?

ఈ నెల మొదటి వారంలో కొడిమ్యాల అటవీ రేంజ్ అధికారి
ఏసీబీ దాడి లో పట్టు పడడంతో జిల్లా అటవీ శాఖ కార్యకలాపాలపై ఏసీబీ అధికారులు విచారణ చేపట్టినట్టు సమాచారం. వారి విచారణలో వెలుగు చూసినా అక్రమాలను ఆ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ అధికారి కి నివేదిక అందించినట్లు తెలిసింది. ఈనెల 30న ఆమె పదవి విరమణ నేపథ్యంలో. ఏసీబీ అధికారులు నివేదిక అంశంపై విచారణ తాత్కాలిక పెండింగ్ లో ఉన్న సమాచారం.
