ఈ నెల 25 న గాయత్రి జయంతి వేడుకలు !

👉  తెలంగాణ రాష్ట్ర గాయత్రి ఉపాసన సంస్థ !

J.SURENDER KUMAR,

హైదరాబాద్ కొత్తపేట  శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయం లోఈ నెల 25 న గాయత్రి జయంతి వేడుకలు  ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు గాయత్రి జప యజ్ఞ సమన్వయ కర్త &  తెలంగాణ రాష్ట్ర గాయత్రి ఉపాసన సంస్థ.అధ్యక్షుడు వినోద్ కుమార్ మహావాది తెలిపారు.

జ్యేష్ట శుద్ధ ఏకాదశి (నిర్జల ఏకాదశి )ని ప్రపంచమంతా పవిత్ర పర్వ దినం గాయత్రి జయంతి గా జరుపుకుంటారు విశ్వామిత్ర . ఋషి గాయత్రి మంత్రాన్ని దర్శించి ప్రపంచానికి అందించిన రోజు అనే ప్రకటనలో పేర్కొన్నారు


గాయత్రి ఒక ప్రాణ శక్తి, గాయత్రిని మించిన మంత్రం, తల్లిని మించిన దైవం ఎక్కడా లేదు. గాయత్రి వేదమాత,
ఈ ప్రపంచం లోనే అత్యంత అధికముగా జపించ బడిన మంత్రం గాయత్రి మంత్రం ఒకటేనని వినోద్ కుమార్ పేర్కొన్నారు.

👉 ఉదయం 7.00 గం. ల నుండి 12.30 వరకు గాయత్రి జపాలు, పూజలు !


👉 ఉదయం 9.00 గం. లకు మహావాది సుధాకర్ శర్మ, చెన్నూర్ (ప్రముఖ ఆధ్యాత్మిక విశ్లేషకులు )  గాయత్రి మంత్ర విశిష్టత గూర్చి ప్రసంగం !

గాయత్రి ఉపాసకులు వినోద్ ( ఫైల్ ఫోటో )


గత మండల కాలం నుంచి అక్షర లక్ష గాయత్రి జపయజ్ఞం లో భాగంగా దాసాంజనేయ స్వామి సన్నిధిలో 8 లక్షల గాయత్రి జపం సామూహికంగా కొనసాగిందానికి తెలిపారు.
అపురూపమైన గాయత్రి జయంతి వేడుకల్లో ప్రతీ ఒక్కరు పాల్గొనవలసిందిగా వినోద్ కుమార్ మహావాది. విజ్ఞప్తి చేశారు.


👉 వివరాలకు ఫోన్ నెంబర్ లో 9000013755 సంప్రదించాల్సిందిగా ప్రకటనలో పేర్కొన్నారు.