👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !
J SURENDER KUMAR,
తెలంగాణ ఉద్యమంలో నల్గొండ బిడ్డలు గర్వంగా చెప్పుకునే నాయకుడు మంత్రి కోమటిరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లాలో ₹13.06 వేల కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా 34 ప్యాకేజీలుగా 6,092 కి.మీ. పొడవు గల 441 రహదారులను విస్తరించే శంకుస్థాపన కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి , కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా ఇన్చార్జి మంత్రి లక్ష్మణ్ కుమార్, సీఎం రేవంత్ రెడ్డికి స్వాగతం పలికారు.
👉 ఈ సందర్భంగా ఎన్‌జీ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

👉 నల్గొండ సభలో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ పాయింట్స్..
👉 ₹13 వేల కోట్ల రూపాయలతో 6,300 కిలో మీటర్ల ఆర్ అండ్ బీ రోడ్ల కు శంకుస్థాపన చేసుకుంటున్నాం..
👉 తొలి తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర సాధన కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ మంత్రి పదవి త్యాగం చేశారు..
👉 మలి తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర కోసం మంత్రి పదవిని కోమటిరెడ్డి త్యాగం చేశారు…
👉 తెలంగాణ రాష్ట్రం కోసం కోమటిరెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేశారు..
👉 త్యాగాల పునాదులపైన అధికారంలోకి వచ్చామని బీఆర్ఎస్ నాయకులు పదే పదే చెపుకుంటున్నారు..
👉 రాజీనామాలు చేయడం, ఎలక్షన్ తేవడం, కలెక్షన్లు చేసుకోవడమే త్యాగమా..?
👉 కొండా లక్ష్మణ్ బాపూజీ మంత్రి పదవి కోసం చేసింది త్యాగం అనాలా ఏం అనాలి ?
👉 కోమటిరెడ్డి రాజీనామా చేయడాన్ని త్యాగం అనాలా ఏమనాలి..?
👉 తెలంగాణ వచ్చాకే కోమటిరెడ్డి మంత్రి పదవి చేపట్టారు.
👉 వంద రూపాయల పెట్రోల్ తెచ్చి పది పైసల అగ్గిపెట్టె దొరకని మమ్మల్నీ ఏమనాలి..?
👉 శ్రీకాంతా చారి, కానిస్టేబుల్ కిష్టయ్య, యాదయ్య త్యాగాన్ని ఏమనాలి…?
👉 ఇషాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి త్యాగాన్ని ఏమనాలి..?
👉 వంద రూపాయల పెట్రోల్ తెచ్చుకని , పది పైసల అగ్గిపెట్టె దొరకని అగ్గిపెట్టే రావు పదేళ్ల పాటు మంత్రి పదవిలో ఉన్నారు..
👉 మీ దోపిడిని ఏ విధంగా సహించాలి..బావా బామర్థులు తోడేళ్లలా తిరుగుతున్నారు..
👉 మళ్లీ అధికారం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెపుతున్నారు..ప్రజలు కోరుకోవడం లేదు..మీ కుటుంబమే కోరుకుంటుంది..
👉 సూర్యాపేటలో మిగిలిన ఆ ఒక్కసీటును మళ్లీ గెలవనివ్వం.
👉 పదేళ్లలో వందేళ్ల విధ్వంసం చేసిన మిమ్మల్ని ఏమనాలి.? బావబామరిది తప్ప, ప్రజలు ఎవరూ మిమ్మల్ని కోరుకోవడం లేదు. మీకుటుంబాన్ని ప్రజలు ఎప్పుడో సామాజిక బహిష్కరణ చేశారు. మీకు భవిష్యత్ లేదు, గతం గురించే చెప్పుకోవాలి.
👉 ప్రతిపక్షాలు కోరితే, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల పాలన, మేనిఫెస్టో అమలుపై చర్చించేందుకు శాసనసభ, శాసనమండలి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం.
👉 రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ 10 ఏళ్ల పాలన, కాంగ్రెస్ ప్రభుత్వ రెండున్నరేళ్ల పాలన, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ 12 ఏళ్ల పాలన, అలాగే ఈ రాజకీయ పార్టీల మేనిఫెస్టోలపై శాసనసభల్లో చర్చించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది .
👉 కాంగ్రెస్ ప్రభుత్వం 30 నెలల్లో 70,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని పేర్కొంటూ, ఈ విషయంపై శాసనసభలో చర్చించి, శాఖల వారీగా ఖాళీలను భర్తీ చేసే వివరాలను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
👉 కే. తారక రామారావు, ఆయన బావమరిది టి. హరీష్ రావు వంటి బీఆర్ఎస్ నాయకులు మాత్రమే ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి రావాలని కోరుకుంటున్నారు.
👉 రాష్ట్ర ప్రజలు కాదు, బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాలనలో సంపదను పోగుచేసుకున్న ఒక కుటుంబం, దాని మద్దతుదారులు మాత్రమే ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకున్నారు.
👉 భవిష్యత్తు లేని బీఆర్ఎస్‌ను ప్రజలు శాశ్వతంగా సామాజికంగా బహిష్కరిస్తున్నారు.”
👉 బీఆర్ఎస్ ప్రభుత్వ 10 ఏళ్ల పాలనలో రాష్ట్ర రుణభారం రూ.69,000 కోట్ల నుంచి రూ.8,11,000 కోట్లకు పెరిగిందని పేర్కొంటూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో 100 ఏళ్లకు సమానమైన రాష్ట్ర విధ్వంసాన్ని చేసింది.
👉 వందలాది ఎకరాల్లో ఫామ్‌హౌస్‌లు కలిగిన బీఆర్ఎస్ నాయకులు, రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇళ్లను కేటాయించడాన్ని జీర్ణించుకోలేక, దానిని రాజకీయం చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నారని
