👉 విత్తన మేళాను ప్రారంభించిన మంత్రి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
రైతుల సంక్షేమం ధ్యేయంగా మా ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం ఇబ్రహీం నగర్ రైతు వేదిక లో మంగళవారం విత్తన మేళా కార్యక్రమాన్ని మంత్రి జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తో కలిసి ప్రారంభించారు.
👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…

గత యాసంగి సీజన్ లో పెద్ద ఎత్తున వారి ధాన్యం, మొక్కజొన్న దిగుబడి వచ్చిందని అన్నారు. అధికారుల సమన్వయంతో పనిచేసి రికార్డు స్థాయిలో ధాన్యం, మక్కలు కొనుగోలు చేశామని మంత్రి వివరించారు. కొనుగోలు చేసిన నాలుగు ఐదు రోజుల లోపు డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు మంత్రి తెలిపారు.

👉 ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం సహకరించుకున్న రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన పంటలను కొనుగోలు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. వానాకాలం సీజన్ లో ప్రభుత్వం సూచించిన ఏడు రకాల విత్తనాలు మాత్రమే రైతులు సాగు చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

👉 గొల్లపల్లి మండలం శ్రీరాములు పల్లి గ్రామంలో ₹ 70 లక్షలతో ప్రమాదకరం గా ఉన్న కరెంట్ వైర్లు తొలగించినట్లు మంత్రి వివరించారు. గ్రామంలో ఐకేపీ సెంటర్ తో పాటు గ్రౌండ్ ప్రతిపాదనలు వచ్చాయని గ్రామంలో మిగిలిన సీసీ రోడ్లు సంఘ భవనాలు పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు.
👉 కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ …..
గతంలో పెద్ద ఎత్తున రైతులు యూరియా స్టాక్ చేసే వారిని, కొత్తగా తీసుకువచ్చిన య్యాప్ ద్వారా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అధిక మొత్తంలో యూరియా వాడటం వల్ల భూసారం తగ్గుతుందని అన్నారు. దొడ్డు రకాల ధాన్యానికి డిమాండ్ లేదని కలెక్టర్ తెలిపారు. రైతులు సన్న వడ్లు సాగు చేయాలని సూచించారు.

👉 జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ మాట్లాడుతూ… ఈనెల 23వ తేది నుంచి 31వ తేది వరకు రైతు వేదికల్లో విత్తన మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయం ప్రకారం ఏడు రకాల విత్తనాలు మాత్రమే సాగు చేయాలని అన్నారు. రైతులకు అవసరమైన విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
