👉 10 సంవత్సరాల తరువాత బస్సు పునరుద్ధరణ !
👉 ప్రారంభించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J SURENDER KUMAR,
గొల్లపల్లి మండలం అబ్బాపూర్ గ్రామ ప్రజలకు మంత్రి లక్ష్మణ్ కుమార్ చొరవతో మంగళవారం ఆర్టీసీ బస్సు సౌకర్యం కలిగింది. 10 సంవత్సరాల తరువాత ఆర్టీసీ బస్సు పునరుద్ధరణకు నోచుకుంది.

👉 జగిత్యాల నుంచి వెల్గటూర్ మండల కేంద్రానికి వయా గొల్లపల్లి, చిల్వకోడూర్, అబ్బాపూర్ మీదుగా వెల్గటూర్ వరకు బస్సు సర్వీసు నడిచేది. 2015లో బస్సు సర్వీసు రద్దు చేయడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. తిరిగి బస్సు ప్రారంభించాలని స్థానికులు మంత్రి లక్ష్మణ్ కుమార్ ను కోరగా మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక చొరవ తీసుకొని బస్సు సౌకర్యం తిరిగి కల్పించారు.

👉 మంత్రి అడ్లూరి మంగళవారం అబ్బాపూర్ గ్రామంలో నూతన బస్సు సర్వీసును ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ బస్సు సౌకర్యం కోసం గ్రామస్థులు పలు సందర్భాల్లో తమకు విజ్ఞప్తి చేశారని తెలిపారు.
👉 గ్రామస్తుల కోరిక మేరకు బస్సు సౌకర్యం తిరిగి అందుబాటులోకి తెచ్చామని మంత్రి తెలిపారు. స్థానికులు బస్సు సౌకర్యం ఉపయోగించుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

👉 గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాన్స్ పార్మార్ ను మంత్రి ప్రారంభించారు. గ్రామంలో మూతబడిన పాఠశాల తిరిగి పునరుద్ధరించగా మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. పాఠశాలలో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థుల సంఖ్య పెంచేలా గ్రామస్థులు కృషి చేయాలని మంత్రి కోరారు.
