👉 6 నెలల్లో అక్కపల్లి లిఫ్ట్ పనులు పూర్తి..!
👉 నక్కల పేట వద్ద మరో కొత్త లిఫ్ట్ ఇరిగేషన్..!
👉 ధర్మపురి నియోజకవర్గ ఇరిగేషన్ సమీక్షలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
J SURENDER KUMAR,
వచ్చేనెల ఆగస్టు15 లోపు రోళ్ల వాగు ప్రాజెక్టు షెల్టర్లు ఏర్పాటుచేసి ప్రాజెక్టు లో నీటి నిలువ చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ధర్మపురి నియోజకవర్గంలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల పై శనివారం హైదరాబాదులో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
👉 జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రంలోని రోళ్లవాగుప్రాజెక్ట్ పనులు గత ప్రభుత్వంలో మొదలుపెట్టి సంవత్సరాలు గడచిన పూర్తి చేయలేదని, మంత్రి లక్ష్మణ్ కుమార్ ఇరిగేషన్ శాఖ మంత్రి కి తెలిపారు. అటవీ శాఖ అనుమతులు తదితర అభ్యంతరాలు తెలుపుతూ గత ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణ పనులలో జాప్యం తదితర అంశాలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వివరించారు.
👉 ప్రాజెక్టు షట్టర్లు బిగించి 0.25 టీఎంసీల నీరు నిలువ ఉంటే పలు గ్రామాలకు చెందిన వేలాది ఎకరాల సాగు జరుగుతుందని మత్స్యకారులకు ప్రాజెక్టులో జీవనోపాధి లభిస్తుందని మంత్రి లక్ష్మణ్ కుమార్ , వివరాలతో కూడిన నివేదికను ఇరిగేషన్ మంత్రికి అందించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ అధికారులకు ఎట్టి పరిస్థితుల్లో ను ఆగస్టు 15 లోపు షట్టర్లు బిగించాలని ఆదేశించారు.
👉 ధర్మపురి నియోజకవర్గంలోని నీటిపారుదల శాఖ ప్రాజెక్టులపై సుదీర్ఘంగా ఇరువురు మంత్రులు అధికారులతో సమక్షించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

👉 రోళ్ళవాగు ప్రాజెక్టు కాలువల పూడికతీత పనులకు అంచనాల తయారు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ధర్మపురి మండలంలోని అక్కపల్లి లిఫ్ట్ పనులు 6 నెలల లోపు పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. 2027 జనవరి చివరి కల్లా అక్కపల్లి ఎత్తిపోతల పథకం నుండి రైతులకు నీటిని అందించే విధంగా పనులు వేగవంతం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.
👉 వెల్గటూర్ మండలంలోని జంగల్ నాల ప్రాజెక్టు అభివృద్ధి పనులు, గొల్లపల్లి మండలంలో యశ్వంత్ రావు పేట, రంగధాముని పల్లి చెరువు ఊడిక తీత పనులకు అంచనాలు తయారు చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
👉 నక్కల పేటలో నూతనంగా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రతిపాదించిన మంత్రి !
ధర్మపురి మండలంలోని నక్కల పేట గ్రామంలో నూతన లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసి సాగునీటిని అందించాలి అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రతిపాదించారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ధర్మపురి మండలంలో నూతన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రతిపాదించడంతో ధర్మపురి మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
👉 సాగునీటి ప్రాజెక్టులకు పూర్తి చేస్తాం.. మంత్రి అడ్లూరి.!
ప్రజా ప్రభుత్వంలో ధర్మపురి నియోజకవర్గంలో ని రైతులకు కావాల్సిన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని మంత్రి లక్ష్మణ్ కుమార్ ఈ సందర్భంగా తెలిపారు.
నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో కమిషన్ ల కోసం మాత్రమే ప్రాజెక్టుల పనులు చేశారని తాము మాత్రం రైతులకు సాగునీరు అందించాలని లక్ష్యంతో ముందుకు సాగుతూ పనులు సకాలంలో పూర్తి చేయడానికి కృషి చేస్తున్నామని మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.
