👉 ప్రభుత్వ హామీలతో ఉద్యమానికి తాత్కాలిక ముగింపు !
👉 విద్యార్థులు ఇళ్లకు వెళ్లాలని పిలుపు !
J.SURENDER KUMAR,
కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులతో జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం తమ ఆందోళనను విరమిస్తున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ప్రకటించింది. పార్టీ ప్రధాన ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లతో కలిసి శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.
👉 సౌరవ్ దాస్ మాట్లాడుతూ……
ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో పలు కీలక అంశాలపై అంగీకారం కుదిరిందని, వాటిని నిర్ణీత గడువులో అమలు చేస్తామన్న హామీ నేపథ్యంలో ఉద్యమాన్ని విరమిస్తున్నట్లు ప్రకటించారు.
👉 జాతీయ ప్రతినిధి అశుతోష్ రాంకా మాట్లాడుతూ,…
తమ ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, విద్యార్థులు వెంటనే ఆందోళనలను విరమించి ఇళ్లకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తు కార్యాచరణను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.
👉 సమావేశంలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ, ….
సీజేపీ ప్రతినిధులు సమర్పించిన పరీక్షల సంస్కరణల చార్టర్‌తో పాటు ఇతర డిమాండ్లను ప్రభుత్వం సానుభూతితో పరిశీలించిందని చెప్పారు. చట్టపరమైన అంశాలు, పరిహారం, పరీక్షల సంస్కరణలపై నిబంధనల మేరకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
👉 సీజేపీ ప్రతినిధుల ప్రకారం, ఉద్యమానికి సంబంధించి నమోదైన కేసుల ఉపసంహరణ, భవిష్యత్తులో ప్రతీకార చర్యలు లేకుండా చూడడం, బాధిత కుటుంబాలకు పరిహారం, అలాగే విద్యా–పరీక్షల సంస్కరణలపై ఐదు అంశాల చార్టర్‌ను ప్రభుత్వం పరిశీలించేందుకు అంగీకరించినట్లు వెల్లడించారు.
ఈ పరిణామాలతో గత కొద్దిరోజులుగా కొనసాగిన ఆందోళనకు తాత్కాలికంగా ముగింపు పలికినట్లు పార్టీ ప్రకటించింది. అయితే ప్రభుత్వం హామీల అమలుపై వచ్చే వారాల్లో పరిస్థితి స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది.
