బతికుండగా అండగా మరణానంతరం భరోసాగా !

👉 తలసేమియా, సికిల్ సెల్ బాధితులందరికీ పెన్షన్లు !

👉 దివ్యాంగులు మరణిస్తే వారి జీవిత భాగస్వామికి తక్షణమే పెన్షన్ !

👉 సీఎం రేవంత్ రెడ్డి మానవీయ నిర్ణయం !

J.SURENDER KUMAR,

సమాజంలో అత్యంత బలహీన వర్గాల జీవన భద్రతకు పెద్దపీట వేస్తూ తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని తలసేమియా, సికిల్ సెల్ అనీమియా బాధితులందరికీ సామాజిక భద్రతా పెన్షన్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అర్హులను వెంటనే గుర్తించి ప్రక్రియ పూర్తి చేసి, ఆగస్టు 15 నుంచి పెన్షన్లు పంపిణీ చేయాలని స్పష్టం చేశారు.

పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ‌ల‌పై మంత్రి ధనసరి అనసూయ సీతక్కతో క‌లిసి ముఖ్య‌మంత్రి గురువారం  స‌మీక్ష నిర్వ‌హించారు. రాష్ట్రంలోని వితంతు, ఒంట‌రి మ‌హిళ‌లు, నేత‌, గీత కార్మికులంద‌రికీ సంతృప్తిక‌ర స్థాయిలో పింఛ‌న్లు మంజూరు చేయాల‌ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  ఆదేశించారు.

👉 దీర్ఘకాలిక వ్యాధులతో పోరాడుతున్న బాధిత కుటుంబాలకు ఈ నిర్ణయం ఆర్థికంగా, మానసికంగా పెద్ద ఊరటనివ్వనుంది. చికిత్సతో పాటు నిత్యజీవన ఖర్చులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ అండగా నిలుస్తుందనే నమ్మకాన్ని ఈ నిర్ణయం కల్పిస్తోంది.

👉 దివ్యాంగులు మరణించిన వెంటనే వారి జీవిత భాగస్వామికి ఎలాంటి జాప్యం లేకుండా పెన్షన్ మంజూరు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

👉 కుటుంబాన్ని కోల్పోయిన దుఃఖంలోనే జీవనాధారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రాకూడదనే మానవీయ దృక్పథానికి ఈ నిర్ణయం నిదర్శనంగా నిలిచింది.


👉 ఇదే సమావేశంలో వితంతువులు, ఒంటరి మహిళలు, నేత కార్మికులు, గీత కార్మికుల అర్హులందరికీ సంతృప్తికర స్థాయిలో పెన్షన్లు అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు
.

👉 సంక్షేమాన్ని కేవలం పథకాలకే పరిమితం చేయకుండా, అవసరమైన ప్రతి కుటుంబానికి భరోసా కల్పించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని ఈ నిర్ణయాలు ప్రతిబింబిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.