👉 మంత్రి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం, విద్యా చైతన్యం, సాహిత్యాభివృద్ధికి బహుజన సాహిత్యం ఎంతో కీలక పాత్ర పోషిస్తోందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
హైదరాబాద్ లో బహుజన సాహిత్య అకాడమీ (BSA) ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన వెస్ట్రన్ ఇండియా 19వ నేషనల్ కాన్ఫరెన్స్‌లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
👉 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…
బహుజన భావజాలాన్ని భావితరాలకు చేరవేయడంలో ఇటువంటి సాహిత్య సదస్సులు, జాతీయ స్థాయి సమావేశాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
బహుజన సాహిత్య అకాడమీ నిర్వహిస్తున్న కార్యక్రమాలను అభినందించిన మంత్రి, సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి సాహిత్యం ఒక శక్తివంతమైన సాధనమని అన్నారు. యువతలో సామాజిక చైతన్యం, రాజ్యాంగ విలువలు, మానవతా దృక్పథం పెంపొందించే దిశగా ఇటువంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆకాంక్షించారు.
