👉 పల్లె దవాఖాన ప్రారంభించిన మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
గ్రామీణ ప్రజల వాకిట్లోకి మెరుగైన ప్రభుత్వ వైద్య సేవలు అందించడానికి పేద ప్రజలకు అందుబాటులో వైద్య సౌకర్యం ఉండేలా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికాలు అమలు చేస్తున్నదని, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ , సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా లో సోమవారం పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు. అమ్రాబాద్ మండలం బ్రహ్మగిరి గ్రామంలో మహిళా సంఘాల భవనానికి శంకుస్థాపన చేసిన మంత్రి అడ్లూరి పల్లె దవాఖానను ప్రారంభించారు.
👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ……

ప్రభుత్వ వైద్యాన్ని పేద ప్రజలకు చేరువ చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని అన్నారు. ఇందులో భాగంగా పల్లె దవాఖానాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అదనపు పడకల ఏర్పాట్లు చేస్తూ ప్రభుత్వ వైద్యాన్ని ప్రజలకు చేరువ చేస్తున్నామని అన్నారు. ప్రజలు ప్రభుత్వ వైద్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
