👉 జగిత్యాల జిల్లాలో 88.43 శాతం డిజిటలైజేషన్ !
J.SURENDER KUMAR,
ఎస్.ఐ.ఆర్. (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమంలో ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణకు మరికొద్ది రోజులే మిగిలి ఉన్నందున ఓటర్ల వివరాల డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు బీఎల్‌వోలు నమోదు చేసిన వివరాల గణాంకాల మేరకు ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గంలో 92.06 శాతం డిజిటలేషన్ పూర్తి కాగా జిల్లాలో 88.43 శాతం డిజిటలైజేషన్ పూర్తయినట్టు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ప్రభుత్వానికి నివేదిక పంపించారు.
బుధవారం హైదరాబాద్ నుంచి ఎస్.ఐ.ఆర్ కార్యక్రమం పురోగతి, ఓటర్ల వివరాల డిజిటలైజేషన్, డేటా నమోదు, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ తదితర అంశాలపై జిల్లా ఎన్నికల అధికారులతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సమీకృత జిల్లా కలెక్టరేట్ (ఐ.డీ.ఓ.సీ) జగిత్యాల నుంచి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి. సత్య ప్రసాద్ ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

జగిత్యాల జిల్లాలో బుధవారం నాటికి 88.43 శాతం డిజిటలైజేషన్ పూర్తయిందన్నారు. ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గంలో 92.06 శాతం కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో 87.74 శాతం, జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో 85.63 శాతం, డిజిటలైజేషన్ పూర్తయిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డికి కలెక్టర్ వివరించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 100 శాతం డిజిటలైజేషన్ పూర్తికాగా, 80 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 90 శాతానికి పైగా డిజిటలైజేషన్ పూర్తయిందన్నారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్) ప్రక్రియను కూడా సమాంతరంగా పూర్తి చేయాలని ఎన్నికల అధికారి సూచించారు.
ఈ సమావేశంలో కలెక్టర్ సత్యప్రసాద్ తో పాటు రెవెన్యూ డివిజనల్ అధికారులు మధుసూదన్, నరసింహరావు, జీవాకర్ రెడ్డి, జగిత్యాల మున్సిపల్ కమిషనర్ లు, తహసీల్దార్ లు, కలెక్టరేట్ ఏవో కిషన్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
