కార్మికులకు రైన్‌కోట్ల పంపిణీ చేసిన చైర్ పర్సన్ నాగలక్ష్మి !


J.SURENDER KUMAR,


భారీ వర్షాల నేపథ్యంలో పట్టణ పారిశుధ్య నిర్వహణలో నిరంతరం విధులు నిర్వర్తిస్తూ ప్రజారోగ్య పరిరక్షణకు కృషి చేస్తున్న ధర్మపురి మున్సిపల్ పారిశుధ్య కార్మికుల ఆరోగ్యాన్ని గుర్తించి  శుక్రవారం చైర్‌పర్సన్  వేముల నాగలక్ష్మి  పారిశుధ్య కార్మికులకు రైన్‌కోట్లను పంపిణీ చేశారు.


👉 ఈ సందర్భంగా చైర్ పర్సన్  మాట్లాడుతూ,..

వర్షాలు ఎంత తీవ్రంగా ఉన్నా పారిశుధ్య కార్మికులు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిరంతరం సేవలు అందిస్తున్నారని, వారి ఆరోగ్యం, భద్రతకు మున్సిపల్ పాలకవర్గం ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్  ఎం. శ్రీనివాస్  మాట్లాడుతూ, భారీ వర్షాల నేపథ్యంలో ధర్మపురి పట్టణ ప్రజలకు ఎటువంటి సమస్యలు ఎదురైనా వెంటనే మున్సిపల్ శాఖ హెల్ప్‌లైన్ నంబర్లకు సమాచారం అందించాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించి అవసరమైన చర్యలు చేపడతారని తెలిపారు.

👉హెల్ప్ లైన్ నంబర్స్ 9676745601, 6301086505


ఈ కార్యక్రమంలోమున్సిపల్ వైస్ చైర్మెన్ ఇందారపు రామన్న , అధికారులు,సానిటరి ఇన్స్పెక్టర్ గంగాధర్ , మేనేజర్ ,ప్రజాప్రతినిధులు, సిబ్బంది మరియు పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.