J.SURENDER KUMAR,
ధర్మపురి అసెంబ్లీ పరిధి గొల్లపల్లి, ధర్మపురి మండలం అర్హులైన 85 మంది లబ్ధిదారులకు ₹ 35,63,500 ( ముప్పది ఐదు లక్షల అరువది మూడు వేల అయిదు వందల రూపాయల) విలువ గల చెక్కులను శనివారం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పంపిణీ చేశారు.

గొల్లపల్లి మండల కేంద్రం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో
మంత్రి అర్హులైన 75 మంది లబ్ధిదారులకు మొత్తం ₹ 25,63,500 విలువైన సీఎంఆర్ఎఫ్ (CMRF) చెక్కులను మంత్రి పంపిణీ చేశారు.
👉 ఈ సందర్భంగామంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ….

ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో అండగా నిలుస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం పారదర్శకంగా సంక్షేమ ఫలాలు అందజేస్తోందని పేర్కొన్నారు.
ప్రజలకు అవసరమైన సమయంలో ప్రభుత్వం అండగా ఉంటుందని, సంక్షేమ పథకాలను ప్రతి అర్హుడికి చేరవేయడమే ప్రభుత్వ లక్ష్యమని, గత ప్రభుత్వంలో సాధ్యం కాని నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని మన ప్రజా ప్రభుత్వంలో సాధ్యం చేసి నూతన రేషన్ కార్డులతో పాటు సన్న బియ్యాన్ని కూడా అందజేస్తున్నామని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
👉 ధర్మపురిలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ !

ధర్మపురి మంత్రి క్యాంపు కార్యాలయంలో 10 మంది లబ్ధిదారులకు సుమారు ₹ 10 లక్షల విలువైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
👉 ఆలయంలో మరో ఉద్యోగికి పదోన్నతి !

ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో మరో ఉద్యోగికి సీనియర్ అసిస్టెంట్ అదోన్నతి లభించింది. మంత్రి చొరవతో వావిలాల తిరుపతి కి దేవాదాయ కమిషనర్ హనుమంతరావు లేఖ సంఖ్య యల్ డిస్ నెంబర్ B1/11701/2026 ఈ నెల 25 న ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతి కల్పిస్తూ జారీచేసిన ఉత్తర్వులను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ క్యాంపు కార్యాలయంలో ఉద్యోగి తిరుపతి కి అందించి అభినందించారు .
ఈకార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేష్ , మున్సిపల్ చైర్మన్ వేముల నాగలక్ష్మి, సూపరింటెండెంట్ అల్వాల శ్రీనివాస్ , మరియు తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
