పేదల సంక్షేమమే ధ్యేయంగా ఇందిరమ్మ ప్రభుత్వం !

J.SURENDER KUMAR,


భూభారతి, ఇందిరమ్మ ఇళ్లపై సమగ్ర సమీక్ష
కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలోని రెవెన్యూ, గృహనిర్మాణం, భూ సర్వే, రిజిస్ట్రేషన్ల శాఖలపై రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో జగిత్యాల కలెక్టరేట్ లో మీడియా సమావేశం నిర్వహించారు.

👉 భూభారతి చట్టం & ధరణి అక్రమాలపై విచారణ!

ధరణి స్థానంలో ప్రజలకు అనుకూలంగా, పారదర్శకమైన ‘భూభారతి’ చట్టాన్ని ఆమోదించి అమల్లోకి తెచ్చామని అన్నారు.


👉 గత ధరణిలో జరిగిన అక్రమాలపై ఎస్‌ఐటీ (SIT) విచారణ తుది దశకు చేరింది. త్వరలోనే వాస్తవాలను ప్రజల ముందు ఉంచి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

👉 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం & నిధుల విడుదల!


👉 గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటివరకు రెండు విడతల్లో 7 లక్షల ఇళ్లు, హైదరాబాద్ కోర్ అర్బన్ పరిధిలో 1 లక్ష ఇళ్లు (మొత్తం 8 లక్షల ఇళ్లు) మంజూరు చేశామని అన్నారు.


👉 ప్రతి ఇంటికి ₹5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నాం.


👉 గత మార్చి 31 నాటికి పూర్తయిన ఇళ్లకు సంబంధించి ₹300 కోట్ల బకాయిలను వచ్చే సోమవారమే విడుదల చేస్తున్నాంమని తెలిపారు. మిగిలిన బకాయిలను నెల రోజుల్లోగా చెల్లిస్తాం.


👉సమగ్ర భూ సర్వే & డిజిటల్ మ్యాపింగ్!

👉 తొలి విడతగా ప్రతి జిల్లాలో 70 రెవెన్యూ గ్రామాల్లో భూ సర్వే ప్రారంభమైందని అన్నారు.


👉 రాబోయే ఏడాదిన్నర (1.5 ఏళ్ల) వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర భూ సర్వే పూర్తి చేసి, కోఆర్డినేట్స్‌తో కూడిన డిజిటల్ మ్యాపింగ్ ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని తెలిపారు.


👉 అధికారుల నిర్లక్ష్యంపై చర్యలు!


విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యల్లో భాగంగా ఒక MROను సస్పెండ్ చేయడంతో పాటు మరొక MROకు ఇంక్రిమెంట్ కోత, పలువురికి చార్జ్ మెమోలు జారీ చేశామని అన్నారు.


👉 ప్రభుత్వం ప్రజామోదయోగ్యంగా పనిచేస్తుందని, సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టే అధికారులను సహించేది లేదని అన్నారు.


👉 జగిత్యాల ఇందిరమ్మ కాలనీ సమస్యల పరిష్కారం!


👉 2008లో జగిత్యాలలో కేటాయించిన 199 ఎకరాల ఇందిరమ్మ కాలనీలో మౌలిక వసతుల కోసం ₹32 కోట్లు కేటాయించాం. పాత బకాయిలు ₹28 కోట్లు క్లియర్ చేశాం. ఆస్పత్రి, పాఠశాలల కోసం మరో ₹30 కోట్లకు పైగా నిధులు మంజూరు చేస్తున్నాం.


👉 అర్హులైన పేదలకు పక్కా ఇళ్లు దక్కాలనే ఉద్దేశంతో, ఇప్పటివరకు అప్లై చేసుకోని బాధితుల కోసం మరో 10 రోజుల పాటు దరఖాస్తుల స్వీకరణకు గడువు ఇస్తున్నాం.


👉పార్టీలతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు కేటాయిస్తాం.


ఈ సమావేశంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వయోవృద్దులు, వికలాంగులు మరియు ట్రాన్స్ జెండర్ సాధికారిత శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, చొప్పదండి శాసనసభ్యులు మేడిపెల్లి సత్యం , పెద్దపెల్లి శాసనసభ్యులు విజయ రమణారావు, మానకొండూర్ శాసనసభ్యులు కవ్వం పెల్లి సత్యనారాయణ, వెలమ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగారావు, స్థానిక ప్రజా ప్రతినిధులు, మరియు తదితరులు పాల్గొన్నారు.