👉 జడ్జి అపర్ణ మల్లాది !
J.SURENDER KUMAR,
యుజిసి మార్గదర్శక ప్రకారం విద్య సంస్థలలో ర్యాగింగ్ వ్యతిరేక చట్టాలతో పాటు, అనేక మార్గదర్శకాలు అమలులో ఉన్నాయని, ఎవరేని వ్యక్తులు తోటి విద్యార్థుల పై కళాశాల ప్రాంగణంలో,బయట ర్యాగింగ్ కు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన శిక్ష లు పడతాయని, మంథని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి అపర్ణ మల్లాది అన్నారు.
శనివారం మండల న్యాయ సేవ సమితి ఆధ్వర్యాన జేఎన్టీయు మంథని ఇంజనీరింగ్ కళాశాల లో ర్యాగింగ్ పై న్యాయ విజ్ఞాన సదస్సు లో మంథని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి అపర్ణ మల్లాది పాల్గొని మాట్లాడుతూ ….
ర్యాగింగ్ అనైతిక చర్య,అమానవీయం అని పేర్కొన్నారు, భారతీయ సంసృతి లో ఇలాంటి చర్య లకు అవకాశం లేదని సత్ప్రవర్తన తో చట్ట బద్ధంగా ఉండాలని విద్యార్థులకు పలు సూచనలు చేశారు.
👉 బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కె.రఘోతం రెడ్డి మాట్లాడుతూ…..
ర్యాగింగ్ పాశ్చాత్య సంసృతని, మనం చట్ట బద్ధమైన పౌరులుగా ఇతరుల హక్కులకు బంగం వాటిల్ల కుండా జాగ్రత్త గా ఉండాలని, మాదక ద్రవ్యాలకు దూరంగా వుండాలని పిలుపునిచ్చారు,
ఈ కార్యక్ర మంలో అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి ఆర సుదా రాణి, ద్వితీయ శ్రేణి న్యాయ మూర్తి అనురాధ, బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ కటకం శ్రీనివాస్, న్యాయ వాదులు శశిభూషణ్ కాచె, నూనేటి ఆంజనేయులు,సి.ఐ.బుద్దే స్వామి, ఏస్.ఐ.టి.శ్రీనివాస్, హార్టికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సువర్ణ ప్రనీత్, జె.ఎన్టీ ఫిజికల్ డైరెక్టర్ పింగిలి కృష్ణ రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు
