👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కలిసిన జగిత్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్ర నరసయ్య !
J SURENDER KUMAR,
జగిత్యాల జిల్లా కేంద్రంలోని కోర్టు భవన సముదాయానికి అదనంగా ఫ్యామిలీ కోర్ట్ మరియు అదనపు మున్సిఫ్ కోర్టు మంజూరు అయ్యాయని వాటి నిర్మాణానికి ప్రభుత్వం ద్వారా అవసరమైన నిధులు మంజూరుకు చేయించాలని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను జగిత్యాల బార్ అసోసియేషన్ సభ్యులు శనివారం ధర్మపురి క్యాంపు కార్యాలయంలో మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు.
నూతనంగా మంజూరైన కోర్టులు నిర్మాణమై అందుబాటులోకి వచ్చినట్లయితే జిల్లా ప్రజలకు త్వరితగతిన కేసులు పరిష్కారమయి కక్షిదారులకు సత్వర న్యాయం జరుగుతుందని మంత్రికి వివరించారు.
👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…
ఈ విషయాన్ని ఆర్థిక, న్యాయ శాఖ మంత్రుల దృష్టికి తీసుకెల్లి నిధులు మంజూరుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. జగిత్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు,ఉపాధ్యక్షులు ఎర్ర నర్సయ్య, మర్రిపెల్లి సత్యప్రకాశ్ ప్రధాన కార్యదర్శి అందే మారుతి మాజీ అధ్యక్షుడు సీనియర్ న్యాయవాది రాచకొండ శ్రీరాములు న్యాయవాది గొంటి కిరిటి,ఎజిపి ఇమ్మడి శ్రీనివాస్ తదితరులు మంత్రిని కలిశారు.
