👉 పెండింగ్ పనులను సత్వరమే పూర్తి చేయాలి !
👉 సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
ఎస్సీ ఎస్టి, దివ్యాంగుల సంక్షేమంతో పాటు విద్య, వైద్యం, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శనివారం ఉట్నూరు పీఎంఆర్సీ కేబీ కాంప్లెక్స్‌లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షేమ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమీక్షా సమావేశం జరిగింది.
👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ….

ఐటీడీఏ పరిధిలోని గిరిజన ప్రాంతాల్లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, నిధుల వినియోగంలో జాప్యం ఉండకూడదని అధికారులను ఆదేశించారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కరించాలని సూచించారు.

👉 గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన వసతులు కల్పించడంతో పాటు రహదారులు, ఇతర మౌలిక వసతులను బలోపేతం చేస్తామని తెలిపారు. సంక్షేమ పథకాల ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ముందుగా కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు ప్రోత్సాహక నగదు చెక్కులను మంత్రి అందజేశారు.

ఈ సమావేశంలో ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్ సంతోష్, గురుకులాల కార్యదర్శి సీతమహాలక్ష్మి, ఐటీడీఏ, సోషల్ వెల్ఫేర్, ఎస్సీ కార్పొరేషన్, దివ్యాంగుల సంక్షేమం, మహిళా శిశు సంక్షేమం, మిషన్ భగీరథ, విద్యుత్ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
