👉ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
భారీ వర్షాల నేపథ్యంలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్యేలు శనివారం సందర్శించారు. ప్రాజెక్టులోని నీటి మట్టం, ఇన్‌ఫ్లో–అవుట్‌ఫ్లో పరిస్థితులను అధికారులతో కలిసి పరిశీలించారు.
👉 ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, …
వరద పరిస్థితుల దృష్ట్యా ప్రాజెక్టు నిర్వహణలో అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దిగువ ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఎగువన కురుస్తున్న వర్షాలు మరియు కడెం ప్రాజెక్ట్ నుండి వస్తున్న భారీ వరద నీటితో ఎల్లంపల్లి జలాశయం నిండుకుండలా మారింది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 20 టీఎంసీలు కాగా, భారీగా వస్తున్న ప్రవాహం కారణంగా గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు అవసరమైతే హెచ్చరికలు జారీ చేసి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలని తెలిపారు.
