ధర్మపురి రజక సంఘం అధ్యక్షుడిగా రాజేందర్ !

👉 ఏకగ్రీవంగా నూతన కార్యవర్గం ఎన్నిక !

J.SURENDER KUMAR,

నియోజకవర్గం కేంద్రమైన ధర్మపురి పట్టణ రజక సంఘ అధ్యక్షుడిగా కొనపర్తి రాజేందర్, తో పాటు నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికయింది.

సంఘ గౌరవ అధ్యక్షుడు గుండారపు నర్సయ్య నేతృత్వంలో శనివారం ఎన్నికలు జరిగాయి. సంఘ సభ్యులంతా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

👉 నూతన కార్యవర్గం….!

గౌరవ అధ్యక్షులు గుండారపు నర్సయ్య, గుండారపు అర్జన్న, అధ్యక్షుడు కొనపర్తి రాజేందర్, ప్రధాన కార్యదర్శి బండపల్లి సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు ఎడమలపెల్లి తిరుపతి, కోశాధికారి గుండారావు అర్జున్, సంయుక్త కార్యదర్శులు మురుకుంట్ల రమేష్, తక్కలపల్లి గంగారం,

కార్యవర్గ సభ్యులు సాంబరాజుల క్రిష్టయ్య, కొనపర్తి సత్యనారాయణ, ముగ్గేడి విజయ్, మల్రాజ్ రాజన్న, ఎనగందుల భీమన్న, కొదురుపాక రవి, మురుకుంట్ల పద్మ, గుండారావు సులోచన, ముఖ్య సలహాదారులు గుడికందుల రామున్న, కాంపెల్లి శంకర్, లీగల్ అడ్వైజర్ సాంబరాజుల కార్తీక్ లు ఎన్నికయ్యారు.