J.SURENDER KUMAR,
ధర్మపురి నియోజకవర్గ ఎండపల్లి మండలంలోని కొత్తపేట గ్రామంలో శుక్రవారం నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరయ్యారు.
👉 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…

పేద, నిరుపేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రధాన లక్ష్యమని అన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరేలా ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. నూతన ఇంటిలో అడుగుపెట్టిన కుటుంబ సభ్యులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
👉 ముఖ్యమంత్రితో చర్చిస్తా !

పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో చర్చించి విడుదలకు కృషి చేస్తానని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. రాష్ట్ర డిగ్రీ మరియు పీజీ కళాశాలల రాష్ట్ర అసోసియేషన్ తీర్మానం మేరకు శుక్రవారం మంత్రి లక్ష్మణ్ కుమార్ విద్యా సంస్థల కరస్పాండెంట్లు కలసి వినతి పత్రం ఇచ్చారు.
👉 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..
ప్రభుత్వం త్వరలోనే సానుకూలంగా స్పందిస్తుందని, అందుకు గాను ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తాను కూడా తీసుకువెళ్తానని ప్రభుత్వం డిగ్రీ కళాశాల పట్ల సానుభూతితో ఉన్నదని త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు.
స్థానిక నవోదయ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ సంగోజు అంజయ్య, శ్రీచైతన్య డిగ్రీ కళాశాల P. లింగమూర్తి మరియు సాధన డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ E. తిరుపతి లు
మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.
