స్పీకర్‌ను అవమానించి పసుపు నీళ్లతో శుద్ధి చేయడమా ?

👉 దళితులపై బీఆర్‌ఎస్‌కు ఉన్న చిన్నచూపునకు ఇదే నిదర్శనం!

👉 బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి !

👉 మాజీ సీఎం కేసీఆర్  బేషరతుగా క్షమాపణ చెప్పాలి !

👉 అసెంబ్లీలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ డిమాండ్ !


J.SURENDER KUMAR,


గౌరవ స్పీకర్‌ను అవమానించిన ఘటనపై పశ్చాత్తాపం వ్యక్తం చేయాల్సింది పోయి, ఆయనకు సంబంధించిన ప్రదేశాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేయడం అత్యంత హేయమైన చర్య అని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  తీవ్రంగా మండిపడ్డారు.
తెలంగాణ ఆత్మగౌరవం కోసం సాధించుకున్న రాష్ట్రంలో దళితుల పట్ల ఇలాంటి వివక్ష, చిన్నచూపు ప్రదర్శించడం యావత్ తెలంగాణ సమాజం తలదించుకునే ఘటన అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

👉 బుధవారం శాసనసభలో ఈ అంశంపై మంత్రి అడ్లూరి మాట్లాడారు…….

👉 తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నదే ఆత్మగౌరవం కోసం. ఇంకా ఎన్ని రోజులు ఈ వివక్ష. ఇంకా ఎంత కాలం ఈ దొరతనం.

: .
👉 గత పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్‌ఎస్ నాయకత్వం తమ కార్యకర్తల ద్వారా పసుపు నీళ్లతో శుద్ధీకరణ చేయించడం వారి ఆలోచనా విధానానికి అద్దం పడుతోందని మంత్రి అన్నారు.

👉 తెలంగాణను సాధించుకున్నది ఆత్మగౌరవం కోసం అని, కానీ నేడు అదే తెలంగాణలో సామాజిక వివక్షకు చోటు కల్పించడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు.

👉 “స్పీకర్‌ను అవమానించి.. పశువుల నీళ్లతో శుద్ధి చేయడం దళితులపై బీఆర్‌ఎస్‌కు ఉన్న చిన్నచూపునకు నిదర్శనం” అని మంత్రి అడ్లురి వ్యాఖ్యానించారు.

👉 ఈ ఘటన కేవలం ఒక వ్యక్తిని అవమానించడం కాదని, స్పీకర్ పదవిని, శాసనసభ గౌరవాన్ని, ఒక సామాజిక వర్గం మనోభావాలను దెబ్బతీయడమేనని స్పష్టం చేశారు.

👉 రాష్ట్రంలోని లక్షలాది దళితుల మనోభావాలను ఈ ఘటన తీవ్రంగా గాయపరిచిందని అన్నారు.

👉 పసుపు నీళ్లతో శుద్ధి చేయడం ఎంతవరకు సమంజసమో బీఆర్‌ఎస్ నాయకత్వం తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

👉 ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చెబుతారని ప్రశ్నించారు. హరీశ్‌రావు, కేటీఆర్ ఈ చర్యను సమర్థిస్తారా అని నిలదీశారు.

👉 స్పీకర్‌పై జరిగిన అవమానకర ఘటనపై బీఆర్‌ఎస్ నాయకత్వంలో కనీస పశ్చాత్తాపం కనిపించడం లేదని విమర్శించారు.

👉 జరిగిన తప్పును అంగీకరించి క్షమాపణ చెప్పాల్సింది పోయి, శుద్ధీకరణ పేరుతో మరోసారి అవమానకర చర్యలకు పాల్పడటం మరింత దారుణమని అన్నారు.

👉 అసలు ఘటనపై క్షమాపణ చెప్పాల్సిన బీఆర్‌ఎస్ నాయకత్వం సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.

👉 ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ప్రతిపక్షానికి ఉందని, ప్రభుత్వ పనితీరును ప్రశ్నించే స్వేచ్ఛ కూడా ఉందని చెప్పారు.

👉 అయితే, రాజకీయ విమర్శల పేరుతో వ్యక్తులను అవమానించడం, రాజ్యాంగబద్ధ పదవులను కించపరచడం ఏమాత్రం సమర్థనీయం కాదని స్పష్టం చేశారు.

👉 ప్రజలు ఇచ్చిన తీర్పును ప్రతి రాజకీయ పార్టీ గౌరవించాల్సిన బాధ్యత ఉందన్నారు.

👉 శాసనసభ్యులు హుందాతనాన్ని విడిచి ఇష్టానుసారంగా మాట్లాడటం ప్రజాస్వామ్య సంప్రదాయాలకు విరుద్ధమని వ్యాఖ్యానించారు.

👉 తెలంగాణ ఆత్మగౌరవం కోసం పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో ఇలాంటి వివక్షాపూరిత ఘటనలు జరగడం అత్యంత దురదృష్టకరమన్నారు.

👉 దళితులు, సామాజికంగా వెనుకబడిన వర్గాల పట్ల చిన్నచూపు చూపే ఇటువంటి చర్యలను తెలంగాణ సమాజం ఎప్పటికీ సహించదని హెచ్చరించారు.

👉 ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

👉 మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా స్పందించి, జరిగిన ఘటనపై బేషరతుగా క్షమాపణ చెప్పాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు.