👉 ఉమ్మడి వెల్గటూర్ మండలంలో ట్రామా కేర్ సెంటర్ !
👉 మా ప్రజా ప్రభుత్వంలో స్మార్ట్ కార్డుల పంపిణీ !
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలో పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానని, ఉమ్మడి వెల్గటూర్ మండల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి పాసిగాం గ్రామంలో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ధర్మపురి నియోజకవర్గం ఎండపల్లి మండల కేంద్రంలో గురువారం జరిగిన స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.
👉ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ……

బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో రేషన్ కార్డుల కొరకు ప్రజలు దరఖాస్తులు చేసుకునేవారని, మా కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో స్మార్ట్ రేషన్ కార్డులను అర్హులైన వారి అందజేస్తున్నామని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
👉 2023లో మార్పు కోరుకొని ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వంలో అర్హులైన వారికి స్మార్ట్ కార్డులను పంపిణీ చేస్తున్నామని మంత్రి తెలిపారు.
👉 ఉమ్మడి వెల్గటూర్ మండల అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నట్లు మంత్రి స్పష్టం చేశారు. నియోజకవర్గంలో ఇప్పటికే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం తో పాటు ధర్మపురిలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేశామని మంత్రి గుర్తు చేశారు. మండలంలో ఐటిఐ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి అన్నారు.

👉 నియోజకవర్గంలోని ప్రజలకు ధర్మపురిలో అందుబాటులో ఉంటూ బాధ్యత మర్చిపోకుండా అందరి సమస్యలు తీర్చు తున్నానని మంత్రి వివరించారు.
👉 నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న రోళ్ళ వాగు ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేసి రంగదామునిపల్లి చెరువు అభివృద్ధితో పాటు జంగల్ నాల ప్రాజెక్టు అభివృద్ధి చేసి సాగునీటిని పూర్తిస్థాయిలో అందిస్తామని మంత్రి తెలిపారు.

👉 ప్రజా ప్రభుత్వంలో ఎండపల్లి మండలంలో 9,900 రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నామని. రేషన్ కార్డు ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ఎండ పల్లి గ్రామానికి 33 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు.
👉 ఎండపల్లి గ్రామంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఎండపల్లి గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణం డ్రైనేజీ నిర్మాణం తో పాటు ఎస్సీ కమిటీ హాల్ నిర్మాణం పూర్తి చేస్తానని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

👉 ఎండపల్లిలో ఎక్స్ ప్రెస్ బస్సు ఆపే విధంగా చర్యలు తీసుకుంటామని జూనియర్ కళాశాల ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మారం సునీత, జగిత్యాల అడిషనల్ కలెక్టర్ కలెక్టర్ లతతో పాటు జగిత్యాల ఆర్డిఓ మధుసూదన్ వివిధ శాఖల అధికారులు మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.
