👉146 మంది లబ్ధిదారులకు ₹49.21 లక్షల విలువైన చెక్కులు!
J.SURENDER KUMAR,
నియోజకవర్గ కేంద్రమైన ధర్మపురి లో మంత్రి క్యాంపు కార్యాలయంలో సోమవారం ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) చెక్కుల ను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

ఆపదలో ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో అండగా నిలుస్తుందని అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సహాయ కార్యక్రమాలు అందేలా కృషి చేస్తామని మంత్రి తెలిపారు.

ఈ సందర్భంగా నియోజకవర్గంలోని అర్హులైన 146 మంది లబ్ధిదారులకు మొత్తం ₹49,21,400 విలువైన CMRF చెక్కులను మంత్రి లక్ష్మణ్ కుమార్ పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
