J.SURENDER KUMAR,
జీవనోపాధి కోసం గల్ఫ్ దేశంలో ధర్మపురి పోలీస్ స్టేషన్ పరిధి దోనూర్ గ్రామానికి చెందిన తోట సత్యం, అక్టోబర్ 28న గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన మృతదేహం ఆదివారం స్వదేశానికి రానున్నది..

గత 20 సంవత్సరాలుగా జీవనోపాధి కోసం గల్ఫ్ దేశానికి రాకపోకలు కొనసాగిస్తున్న తోట సత్యం, నెల రోజుల క్రితం దోనూర్ నుంచి గల్ఫ్ కు వచ్చాడు.. గత నెల 28న గుండెపోటు తో మృతి చెందారు.

సత్యం మృతదేహం స్వగ్రామానికి తరలించడానికి మూల నర్సింహులు, శేఖర్, శ్రీధర్, రాజు, గల్ఫ్ కార్మిక సేవాసమితి సభ్యులు అక్కడి భారత రాయబార కార్యాలయం తో సంప్రదింపులు జరిపి.. మృతదేహం తరలింపుకు అధికారిగా అనుమతి పత్రాలు పొందారు. దోనూర్ గ్రామానికి చెందిన శ్రీధర్ శనివారం సాయంత్రం మృతదేహంతో స్వదేశానికి బయలుదేరారు ఆదివారం సాయంత్రం వరకు సత్యం మృతదేహం గ్రామానికి రానున్నది.
