ఫోటోగ్రాఫర్ సాత్విక్ కు జాతీయ ఎక్సలెన్స్ ఆఫ్ ద ఇయర్ అవార్డు!


👉 జాతీయ స్థాయి ఉత్తమ పోటో గ్రాఫర్ అవార్డు తీసుకున్న తెలంగాణ (ధర్మపురి) యువ ఫోటోగ్రాఫర్ సాత్విక్ !


👉 గుంటూరు లో గాంధీ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన అవార్డుల ప్రదానోత్సవంలో ఎక్సలెన్స్ అవార్డు ఆఫ్ ద ఇయర్ అందుకున్న సాత్విక్ !

J SURENDER KUMAR,

ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా…ఫోటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా (PAI), ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సృజనాత్మక మరియు సాంస్కృతిక కమిషన్ శాఖ సహకారంతో నిర్వహించిన 15th ఆగస్టు ఉత్సవాలు 2026 ఒక్క రోజు తీసిన స్పాట్ ఫోటో జాతీయ స్థాయి కాంపిటీషన్ లో సాత్విక్ వడ్లూరి ధర్మపురి (తెలంగాణ) తీసిన హై స్కై సెలబ్రేషన్ ఫోటో ఎక్సలెన్స్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కైవసం చేసుకుంది.

👉 అవార్డు కైవసం చేసుకున్న ఫోటో ( ఫైల్ ఫోటో )

ఈ అవార్డు ను అక్టోబర్ 2 న గాంధీ జయంతి సందర్భంగా గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ANU) క్యాంపస్‌లోని వికాస భవన్‌లో ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శన మరియు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆచార్య నాగార్జున యూనివర్శిటీ చైర్మన్ అండ్ ప్రిన్సిపల్ ప్రొఫెషర్ యం. సురేష్ కుమార్… పోటోగ్రఫీ అకాడమీ ఇండియా చైర్మన్ టి. శ్రీనివాసా రెడ్డి చేతుల మీదుగా క్యాష్ అవార్డు తో పాటు ప్రశంసా పత్రం అందచేసి ఘనంగా సన్మానం చేసారు.

గతంలో సాత్విక్ తీసిన చాలా పోటోలు రాష్ట్ర స్థాయి ఫోటో గ్రఫీ పోటీల్లో అవార్డుల కు ఎంపికై ప్రదర్శించబడ్డాయి. జాతీయ స్థాయి కి ఎదిగిన ధర్మపురి కి చెందిన యువ ఫోటో గ్రాఫర్ సాత్విక్ కు పట్టణంలోని పలువురు ప్రముఖులు… అభినందనలు తెలిపారు.