పుష్కరాల పై ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ సమీక్ష !

J.SURENDER KUMAR,


గోదావరి పుష్కరాలు–2027కు సంబంధించిన అభివృద్ధి పనులు, మౌలిక వసతుల ఏర్పాట్లను ప్రాధాన్యతతో చేపట్టి, నిర్ణీత గడువుల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ సంబంధిత జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

శనివారం సంబంధిత జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పుష్కరాల ఏర్పాట్లపై సమీక్షించారు. జగిత్యాల కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ సమీక్షలో పాల్గొన్నారు.


👉 దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ మాట్లాడుతూ…..


పుష్కర ఘాట్లు, ఆలయ అభివృద్ధి పనులు, రహదారులు, తాగునీరు, పారిశుధ్యం తదితర పనుల పురోగతిని శాఖల సమన్వయంతో నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. భూసేకరణ, టెండర్లు, సాంకేతిక అనుమతులు తదితర పెండింగ్ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి, పనుల అమలులో ఎదురయ్యే ఆటంకాలను పరిష్కరించాలని ఆదేశించారు.

👉 పని వారీగా పురోగతి, పెండింగ్ అంశాలు, తదుపరి కార్యాచరణను స్పష్టంగా నమోదు చేసి, ప్రభుత్వ స్థాయిలో నిర్ణయాలు అవసరమైన అంశాలను సకాలంలో నివేదించాలని సూచించారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా ఏర్పాట్లు చేపట్టాలని పేర్కొన్నారు.

👉 ఈ సమీక్ష లో జిల్లా అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్, జిల్లా రెవెన్యూ అధికారి కె. వై ప్రసాద్, ఆర్డీవోలు మధు సూదన్, నరసింహ రావు, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ అధికారులు, కలెక్టరేట్ ఏవో కిషన్, తహసీల్దార్ లు, ధర్మపురి మున్సిపల్ కమిషనర్ ఎంపిడివోలు, సంబందిత శాఖ అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.