👉 మంత్రి లక్ష్మణ్ కుమార్ కు యాక్షన్ ప్లాన్ వివరించిన
ఎస్పీ అశోక్ కుమార్ !
J.SURENDER KUMAR,
గురువారం జగిత్యాల జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం మినీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్.ప్రసునాంబలతో కలిసి సంబంధిత శాఖల అధికారులతో గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, అభివృద్ధి పనుల పురోగతిపై మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.
జిల్లాలో జరుగునున్న గోదావరి నది పుష్కర ప్రాంతాలలో 10 వేలమంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహణకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్టు ఎస్పీ అశోక్ కుమార్ మంత్రి లక్ష్మణ్ కుమార్ కు వివరించారు.
👉 ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ,….
పుష్కరాల భద్రత కోసం మొత్తం 9,978 మంది పోలీసు సిబ్బందితో పాటు 22 అదనపు బలగాల యూనిట్లను ప్రతిపాదించినట్లు తెలిపారు. ధర్మపురిలో 4,010 మంది సిబ్బంది, 12 యూనిట్లు, బీర్పూర్లో 1,990 మంది సిబ్బంది, 10 యూనిట్లు, వెల్గటూర్లో 1,861 మంది, మల్లాపూర్లో 1,051 మంది, రాయికల్లో 626 మంది, ఇబ్రహీంపట్నంలో 440 మంది సిబ్బందిని కేటాయించేలా ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు.
👉 భారీ సంఖ్యలో వచ్చే భక్తులను ఉద్దేశించి ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు రాకుండా అవసరమైన మేర రోడ్డు డైవర్షన్స్ చేపడతామని రోడ్లలో ఎక్కడ కూడా ఎటువంటి సమస్య రాకుండా ముందస్తుగానే పరిశీలిస్తామని ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కాకుండా ఎక్కడికక్కడ సిబ్బందిని ఏర్పాటు చేస్తూ సజావుగా పుష్కరాలను నిర్వహించేందుకు పటిష్ట కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు
👉 వివిధ జిల్లాలో మార్గాల నుంచి పుష్కరాలకు వచ్చే భక్తులకు సరైన పార్కింగ్ సౌకర్యం ఉండే విధంగా ప్రణాళికల సిద్ధం చేస్తున్నామని ప్రతి రూటుకు సెపరేట్ పార్కింగ్ ఏరియాలో ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు.
ఈ సమీక్ష సమావేశంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎస్. దినేష్, ఆర్.డి.ఓ. లు, పి.ఆర్, ఆర్&బి, పబ్లిక్ హెల్త్, మిషన్ భగీరథ ఇంజనీరింగ్ , దేవాదాయ, మున్సిపల్, రెవెన్యూ , పోలీస్ శాఖల అధికారులు , సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
