ధర్మపురి  పట్టణ అభివృద్ధి బాధ్యత నాదే!

👉 పుష్కరాల పనులకు నిధులు విడుదల చేయించి పనులు ప్రారంభించాం.!

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..!


J.SURENDER KUMAR,


ధర్మపురి పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని, పుష్కరాల అభివృద్ధి పనుల కోసం నిధులు విడుదల చేయించి పనులు కూడా ప్రారంభించామని తెలిపారు. ధర్మపురి అభివృద్ధికి అవసరమైన నిధులు తీసుకువచ్చి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి తీర్చిదిద్దే బాధ్యత తనదేనని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

ధర్మపురి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం లో సోమవారం ఏర్పాటు చేసిన నూతన చేయూత సామాజిక భద్రత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొని, ధర్మపురి మున్సిపాలిటీ పరిధిలోని 15 వార్డులకు చెందిన 165 మంది నూతన పింఛనుదారులకు మంత్రి మంజూరు పత్రాలను అందజేశారు.

👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…..

అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

👉 గత పదేళ్ల పాలనలో అర్హులైన పేదలకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయలేదని అన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు అందించడంతో పాటు, రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం పంపిణీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు.

👉 సామాజిక భద్రతకు ప్రాధాన్యతనిస్తూ వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, ఇతర అర్హులైన వారికి చేయూత పింఛన్లు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇంకా పింఛన్లు పొందని అర్హులైన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, విడతలవారీగా ప్రతి అర్హుడికి పింఛన్ అందించేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.

👉 ధర్మపురి పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని, పుష్కరాల అభివృద్ధి పనుల కోసం నిధులు విడుదల చేయించి పనులు కూడా ప్రారంభించామని తెలిపారు. ధర్మపురి అభివృద్ధికి అవసరమైన నిధులు తీసుకువచ్చి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి తీర్చిదిద్దే బాధ్యత తనదేనని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు.

👉 ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రసునాంభ, PD DRDA రఘువరన్ , అధికారులు ధర్మపురి మున్సిపల్ చైర్ పర్సన్ , వేముల నాగలక్ష్మి రాజేష్, వైస్ చైర్మన్ ఇందారపు రామన్న, ధర్మపురి మున్సిపల్ కౌన్సిలర్లు వివిధ గ్రామాల సర్పంచులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులు పాల్గొన్నారు.