పైలాన్‌ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి!


J.SURENDER KUMAR,


రాష్ట్రంలో హైబ్రీడ్ యాన్యుటీ మోడల్ (HAM) రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతూ, నల్గొండ జిల్లా కనగల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో ఏర్పాటు చేసిన పైలాన్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఆవిష్కరించారు.

👉 ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి , కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

👉 రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో ₹13.06 వేల కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా 34 ప్యాకేజీలుగా 6,092 కి.మీ. పొడవు గల 441 రహదారులను విస్తరించే కార్యక్రమం పైలాన్ ఆవిష్కరణతో ప్రారంభమైంది. పైలాన్ ఆవిష్కరించిన తర్వాత ముఖ్యమంత్రి  స్థానికులను పలకరిస్తూ వారితో కరచాలనం చేస్తూ ముందుకు కదిలారు.