పోలియో రహిత సమాజంలో భాగస్వాములు కావాలి !

👉 బొరబండలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రులు, ఎమ్మెల్యే !


J SURENDER KUMAR,


పోలియో రహిత సమాజ నిర్మాణంలో తల్లిదండ్రులు, వైద్య సిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలు మరియు ప్రజలందరూ భాగస్వాములు కావాలని  మంత్రులు ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

హైదరాబాద్‌ బొరబండలో నిర్వహించిన జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మరియు స్థానిక ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కలిసి ప్రారంభించారు.

👉 ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ…


చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, ఆరోగ్యవంతమైన తెలంగాణ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. పోలియో వంటి వ్యాధులను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని మంత్రులు సూచించారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.