👉 గుల్ల కోటలో కిచెన్ షెడ్స్ ప్రారంభించిన మంత్రి అడ్లూరి !
J.SURENDER KUMAR,
సమాజంలో చదువును మించిన ఆస్తి లేదని, ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న అనేక మంది గొప్ప వ్యక్తులు అయ్యారని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వయోవృద్దులు, వికలాoగులు, ట్రాన్స్ జెండర్ సాధికారత శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అన్నారు.
ఎండపల్లి మండలం గుల్ల కోట గ్రామంలోని మండల ప్రజా పరిషత్ పాఠశాలలో, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ₹10 లక్షలతో నూతనంగా నిర్మించిన కిచెన్ షెడ్స్ ను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం ప్రారంభించారు. ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రికి పాఠశాల విద్యార్థులు ఘన స్వాగతం పలికారు.
👉 ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విద్యకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి నాణ్యమైన విద్యను అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని మంత్రి అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు.

వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం లోపు పాఠశాలల్లో పనులు పూర్తి చేసి విద్యార్థులకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. గుల్లకోట గ్రామంలో రోడ్లు ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
