👉 స్వాగతించిన మంత్రి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
ధర్మపురి నియోజకవర్గ పరిధి ధర్మారం మండలానికి చెందిన సర్పంచులు పలువురు వార్డు మెంబర్లు ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ధర్మపురి పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ధర్మారం మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీలో చేరారు. రామయ్య పల్లె సర్పంచ్ మూలమంగ మల్లేశం తో పాటు బొమ్మ రెడ్డి పల్లి సర్పంచ్ ధారా రాజకుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

కొత్తగా పార్టీలో చేరిన సర్పంచులు గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యలే అజెండాగా పనిచేయాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ వారికి సూచించారు.
